పలువురు ఐఎఎస్ అధికారులు బదిలీలు
అమరావతి, సెప్టెంబర్ 3:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం పలువురు ఐఎఎస్ అధికారుల బదిలీలు చేస్తూ మరి కొందరికి పోస్టింగ్‌లు ఇస్తూ జి.ఓ.ఆర్.టి. నెం.1628ను జారీ చేసింది. సర్వే సెటిల్‌మెంట్స్ & ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌గా రోనంకి కూర్మనాథ్ (IAS 2016) నియమితులయ్యారు. ఈస్ట్ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా వై. మేఘ స్వరూప్ (IAS 2021) బాధ్యతలు స్వీకరించనున్నారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా అశుతోష్ శ్రీవాస్తవ (IAS 2021)ను నియమించారు. పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా సి. యశ్వంత్‌కుమార్ రెడ్డి (IAS 2021) నియామకం కాగా, అదనంగా ఆయన ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ బాధ్యతలు కూడా చేపట్టనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పడేరు ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా తిరుమాని శ్రీ పూజ (IAS 2022)ను నియమించారు. అదేవిధంగా, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ (విజిలెన్స్)గా కల్పశ్రీ కె.ఆర్ (IAS 2022), రాంపచోదవరం ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా బచ్చు స్మరణ్ రాజ్ (IAS 2022) బాధ్యతలు స్వీకరించనున్నారు. పోస్టింగ్ లేకుండా బదిలీ అయిన అధికారులు తరువాత నియామకాల కోసం జీఎడీలో హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.