Janam Online

జ‌గ‌న్ అరెస్టుయితే పార్టీ నాదే...!

వైకాపాలో ఇప్పుడు మాజీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి హ‌వా న‌డుస్తోంది. ఒక వైపు కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు పార్టీని వీడిపోతుంటే...మ‌రి కొంద‌రు గ‌తంలో చేసిన పాపాల‌కు జైలు పాల‌వుతున్నారు. మ‌రి కొంద‌రు ఇప్పుడే మ‌న‌కెందుకులే...అంటూ..మౌనాన్ని ఆశ్ర‌యిస్తుండ‌గా...ఇక దొరికిందే సంద‌న్న‌ట్లు స‌జ్జ‌ల చెల‌రేగిపోతున్నారు. మ‌ద్యం కుంభ‌కోణంలో చిత్తూరు పుడింగి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి త‌న‌యుడు అరెస్టు కావ‌డంతో..ఇక త‌రువాత వంతు జ‌గ‌న్‌దేన‌ని స‌జ్జ‌ల సంబ‌ర‌ప‌డిపోతున్నాడ‌ట‌. నిన్న‌టికి నిన్న ఆయ‌న పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో చేసిన హ‌డావుడిని చూసిన వైకాపా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు... అవాక్క‌య్యార‌ట‌. కొంద‌రైతే..అత‌ని వ్య‌వ‌హారం చూసి ఇత‌ను మ‌రోసారి పార్టీని నాకించేస్తాడ‌ని తీర్మానించుకుని అక్క‌డ నుంచి మాయ‌మ‌య్యార‌ట‌. మ‌ద్యం కేసులో ఇంకా జ‌గ‌న్‌ను అరెస్టు చేయ‌క‌ముందే..స‌జ్జ‌ల త‌న‌కు అనుకూల‌మైన మీడియా ప్ర‌తినిధుల‌ను ర‌ప్పించుకుని...ఫేస్ టూ ఫేస్ ఇంట‌ర్వ్యూలు ఇచ్చేశారు. తానే పార్టీ అధినేత‌ను అన్న‌ట్లు..ఒక‌టే బిల్డ‌ప్‌లు ఇస్తూ..జ‌గ‌న్ అరెస్టు అయితే..ఇబ్బందేముంది...నేను న‌డిపించేస్తాను..అన్న‌ట్లు క‌ల‌రింగ్ ఇచ్చార‌ట‌. గ‌తంలో జ‌గ‌న్ అరెస్టు అయితే..పార్టీని న‌డిపించ‌లేదా..? ఇప్పుడూ అదే చేస్తాను అన్న‌ట్లు..పార్టీలో తాను త‌ప్ప ఇంకో నేతే లేడ‌న‌ట్లు ఆయ‌న చూపించిన హావ‌భావాల‌కు వైకాపాను నిజంగా అభిమానించే నేత‌లు తీవ్ర ఆగ్ర‌హాన్ని, అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశార‌ట‌. ఇత‌ని వ‌ల్ల ఇప్ప‌టికే ఘోరంగా ఓడిపోయాం...మ‌రోసారి..ఇత‌ను పార్టీని ముంచేస్తాడు...ఇత‌ని న‌మ్మిన జ‌గ‌న్‌ను అనాలంటూ..ఒక‌టే శాప‌నార్ధాలు పెట్టార‌ట‌. అస‌లు లిక్క‌ర్ కేసులో జ‌గ‌న్ ఎప్పుడు అరెస్టు అవుతాడ‌న్న‌ట్లుగా స‌జ్జ‌ల వ్య‌వ‌హారం ఉంద‌ని, ఇప్ప‌టికిప్పుడు వ‌న్ టూ వ‌న్ ప్రెస్మీట్‌లు పెట్టాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని వాళ్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఒక‌వైపు కూట‌మి నేత‌లు బిగ్‌బాస్ అంటూ జ‌గ‌న్ వైపు చూయిస్తుంటే..గుమ్మ‌డికాయ‌ల దొంగ భుజాలు త‌డుముకున్న‌ట్లు స‌జ్జ‌ల ప్రెస్ మీట్ పెట్టి...బిగ్‌బాస్ జ‌గ‌నే అన్న‌ట్లు చెప్ప‌డం వారిని హ‌తాశుల‌ను చేస్తోంది. ఏమిటి..? ఈయ‌న ఈ పార్టీని ఏమి చేయాల‌నుకుంటున్నారు..?


గ‌తంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోతే..మా ఓట‌ర్లు ప్ర‌త్యేకంగా ఉన్నారంటూ..అప్ప‌ట్లో..పార్టీని ముంచేసిన ఈయ‌న ఇప్పుడు జ‌గ‌న్‌ను అరెస్టు చేయండి..పార్టీని నాకు అప్ప‌గించండి..అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైకాపాను అభిమానించే సామాజిక‌వ‌ర్గ నేత‌లు అంటున్నారు. నిజంగా జ‌గ‌న్‌కు ఇంత జ‌రిగినా..ఇంకా బుద్ది రాలేద‌ని, గ‌తంలో స‌క‌ల శాఖ‌ల‌ను ఆయ‌న‌కు అప్ప‌గించి చేతులు కాల్చుకున్నా..ఇప్పుడు మ‌ళ్లీ అత‌న్నే మ‌ళ్లీ తెస్తున్నార‌ని, ఇలాంటి వారిని చూసిన జ‌నం మ‌ళ్లీ మ‌మ్మ‌ల్ని న‌మ్ముతారా..? అంటూ ఆవేద‌న చెందుతున్నారు. ఒక‌వైపు మేమంతా మ‌ళ్లీ జ‌గ‌న్ వ‌స్తాడు..ముఖ్య‌మంత్రి అవుతాడ‌ని ఒక‌టే హోరెత్తిస్తుంటే.. ఇక్క‌డేమో..మ‌ళ్లీ స‌జ్జ‌ల భాగోతాలు జ‌రుగుతున్నాయ‌ని, గ‌తంలో ఈ భాగోతాలు చేసే క‌దా జ‌నం ఛీత్క‌రించింది..మ‌ళ్లీ జ‌గ‌న్ వ‌స్తే..మ‌ళ్లీ అవే భాగోతాలే కదా.. ఇంత‌దానికి మ‌ళ్లీ జ‌గ‌న్ రావ‌డం ఎందుకంటూ..జ‌నాలు ప్ర‌శ్నించ‌రా..? జ‌గ‌న్‌ను గెలిపించి ముఖ్య‌మంత్రిని చేస్తే..స‌జ్జ‌ల పాలిస్తారా..? జ‌గ‌న్ ఇంట్లో ప‌డుకుం టారా..? అంటూ జ‌నాలు అడిగితే..ఏమి స‌మాధానం చెప్పాల‌ని వారు త‌మ‌లో తాము చ‌ర్చించుకుంటున్నారు. మొత్తం మీద స‌జ్జ‌ల వ్య‌వ‌హారం వైకాపాలో..తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అయితే..జ‌గ‌న్ కు ఎదురు చెప్పే ధైర్యం ఆ పార్టీలో లేక‌పోవ‌డంతో..అణిగిమ‌ణిగి అసంతృప్తితో కొంద‌రు నేత‌లు ఉంటున్నారు. ఇదే ర‌కంగా పార్టీ మొత్తం స‌జ్జ‌ల చేతిలోనే ఉంటే..అక్క‌డ‌క్క‌డా ఉన్న కొంద‌రు మంచి నేత‌లు ఎవ‌రిదారి వారు చూసుకుంటార‌నే ప్ర‌చారం ఉంది.మొత్తం మీద‌..స‌జ్జ‌ల మ‌రోసారి జ‌గ‌న్ కొంప ముంచుతార‌ని వారే చ‌ర్చించుకుంటున్నారు.