మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి కోరికను నెరవేర్చారు. ఇటీవల కాలంలో ఆయన చంద్రబాబును ఉద్దేశించి వ్యంగ్యంగా చేస్తోన్న వ్యాఖ్యలకు చంద్రబాబు నేరుగా కౌంటర్ ఇచ్చి...జగన్‌ను మళ్లీ మాట్లాడకుండా చేస్తున్నారు. మొన్నటి దాకా...జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా...చిట్టితల్లీ నీకు..పదిహేను.. నీకు పదిహేను..ఇటురా..తల్లీ..అంటూ..చంద్రబాబు పథకాలను ఎద్దేవా చేస్తూ వచ్చారు. అదే సమయంలో ఉచిత బస్సు పథకంపై కూడా జగన్ కౌంటర్లు వేసేవారు. అయితే..ఆయన కౌంటర్లకు చంద్రబాబు చేతల్లో సమాధానం చెబుతున్నారు. ఆ మధ్య జగన్ ఉచిత బస్సు పధకం గురించి మాట్లాడుతూ చంద్రబాబు మోసగాడు..ఏమీ చేయడు..అంటూ తమ పులివెందుల మహిళలు విజయవాడ, వైజాగ్ లకు ఉచితంగా ఆర్‌టిసి ద్వారా ప్రయాణించి చూడాలనుకుంటు న్నారన్నారు. ఉచిత బస్సు పథకం జిల్లాల వరకే పరిమితం చేస్తారని, తద్వారా చంద్రబాబును విమర్శించవచ్చని జగన్ కలలు కన్నారు. అయితే..జగన్ కోరికను చంద్రబాబు సంపూర్ణంగా తీర్చేస్తున్నారు. పులివెందుల మహిళలే కాదు...రాష్ట్రంలో ఏమూలన ఉన్న మహిళలు అయినా..రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని చంద్రబాబు మహిళలకు కల్పించారు.. పథకం అమలుకు ముందే ఎద్దేవా చేసిన జగన్ ఇప్పుడు చంద్రబాబు పథకాన్ని సంపూర్ణంగా, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అమలు చేస్తోండడంతో..అవాక్కువుతున్నారు. తాను ఏదో చేద్దామనకుంటే..ఏదో అవుతుందనే భావన జగన్‌లో వ్యక్తం అవుతోంది. అసలు ముందుగానే..సూపర్ సిక్స్ ప్లాప్..చంద్రబాబు..మోసగాడు..అంటూ వైకాపా సాగించిన ప్రచారం ఇప్పుడు వారికే తిప్పికొడుతోంది. అమ్మకువందనం..అమలు చేయరన్నారు. కానీ దాన్ని అమలు చేసి చూపించారు చంద్రబాబు..ఉచిత బస్సు లేదూ..ఏమీ లేదన్నారు..కానీ దాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. రైతు భరోసా లేదన్నారు..అన్నదాత సుఖీభవ అమలు అయింది..ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం విజయవంతంగా సాగుతోంది. (కొన్ని లోపాలు ఉండవచ్చు) ఇక సూపర్ సిక్స్‌లో మిగిలింది...ఒకే ఒక్కటి..అది మహిళలకు రూ.1500/- ఇవ్వడం.. దాని కోసం కూడా చంద్రబాబు బాగానే కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు మోసగాడు..పథకాలు ఇవ్వడు..అని జగన్ చెబితే ప్రజలు ఇప్పుడు నోటితో నవ్వరు..? జగన్‌ను ఉచ్చులోకి లాగి..తరువాత చంద్రబాబు జాగ్రత్తగా మూసేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తం మీద..జగన్ కోరికలన్నింటిని చంద్రబాబు నెరవేరుస్తూనే వెళుతున్నారు.