ఇంగ్లాడ్‌తో జరుగుతున్న నాల్గవ టెస్టులో భారత్ డ్రా కోసం పోరాడుతోంది. ఆట నాలుగో రోజున భారత్ బ్యాటర్స్ టెస్టును డ్రా చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు వెనుకబడ్డ ఆ లోటును భర్తీ చేసేందుకు రెండో ఇన్నింగ్స్‌లో తీవ్రంగా యత్నిస్తోంది. ఆట నాలుగోరోజు ముగిసే సమయానికి భారత్ 174/2 తో ఉంది. మరో 137 పరుగులు వెనుకబడి ఉంది. ఈ స్థితిలో ఐదో రోజు ఈ పరుగులను పూర్తి చేసి..సాయంత్రం వరకూ ఆలౌట్ కాకుండా ఉంటేనే మ్యాచ్ డ్రా అయ్యేది. అయితే ఇప్పుడు ఆశలన్నీ ఓపెనర్ రాహుల్, కెప్టెన్ గిల్‌లపైనే ఉన్నాయి. వీరిద్దరు మూడో వికెట్‌కు 174 పరుగులు జోడించారు. ఇంగ్లాండ్‌కు భారీ ఆధిక్యం సమర్పించుకున్న భారత్‌కు రెండో ఇన్నింగ్స్‌లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్కోర్ బోర్డుపై పరుగులే లేకుండానే ఒపెనర్ యశ్వసీ, కొత్త కుర్రాడు సాయి సుదర్శన్‌లు సున్నాకే అవుటయ్యారు. ఈ స్థితిలో భారత్ నాలుగో రోజే తెల్లజెండా చూపిస్తుందనిపించింది. అయితే రాహుల్, గిల్‌లు సమర్థవంతంగా ఇంగ్లీష్ బౌలర్లను ఎదుర్కొని భారత్‌కు డ్రా ఆశలు కల్పిస్తున్నారు. ఇద్దరూ బ్రిటీష్ బౌలర్లును ఆచితూచి ఆడుతూ, అప్పడప్పుడూ బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును కదిలించారు. ఇద్దరూ కలిసి మరో వికెట్ కోల్పోకుండా అర్ధసెంచరీలు సాధించారు. రాహుల్ (87) పరుగులు సాధించగా శుభమ్‌గిల్ (78) పరుగులు సాధించారు. అయితే ఇప్పటికీ భారత్‌కు ఓటమి ముప్పు తప్పిపోలేదు. రేపు టీ వరకూ ఇండియా ఆడితేనే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం ఇంగ్లీష్ బౌలర్లు కొత్త బంతితో రెచ్చిపోయే అవకాశం ఉంది. ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్లను తట్టుకుంటూ టీ వరకు ఆడగలిగితేనే డ్రా కు అవకాశం ఉంటుంది.