Janam Online

మ‌ద్యం అరెస్టుల‌పై ఢిల్లీలో జ‌గ‌న్ ధ‌ర్నా...!?

మ‌ద్యం కేసుల్లో వ‌రుస‌గా అరెస్టులు జ‌రుగుతుండ‌డంతో..త‌న వ‌ద్ద‌కు వ‌స్తే..ఏమి చేయాలో తెలియ‌క అల్లాడుతున్న వైకాపా అధ్య‌క్షుడు దీనిపై ఢిల్లీలో ర‌చ్చ చేయాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ కేసులో ఎంపి మిధున్‌రెడ్డ‌,మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, అప్ప‌టి సిఎం కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రించిన ధ‌నుంజ‌య‌రెడ్డి, జ‌గ‌న్‌కు ఓఎస్‌డిగా ప‌నిచేసిన కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, వాసుదేవ‌రెడ్డి, క‌సిరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, బాలాజీగోవింద‌ప్ప‌తో పాటు మ‌రికొంద‌రు అరెస్టు కావ‌డంతో..ఇక త‌న‌ను కూడా అరెస్టు చేస్తార‌నే భావ‌న వై.ఎస్‌.జ‌గ‌న్‌లో నెల‌కొంద‌ని పార్టీకే చెందిన కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నార‌ట‌. దీంతో..ఈ అరెస్టుల‌పై ర‌చ్చ చేసేందుకు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఢిల్లీలో ధ‌ర్నా చేయాల‌నే ఆలోచ‌న చేస్తున్నార‌ని తెలిసింది. వ‌చ్చే నెల‌లో ఆయ‌న దీనిపై ప్ర‌క‌ట‌న చేస్తారంటున్నారు. మ‌ద్యం కుంభ‌కోణ‌మే జ‌ర‌గ‌లేద‌ని, అలాంట‌ప్పుడు మ‌ద్యం కేసు అంటూ అక్ర‌మ అరెస్టులు చేస్తున్నారంటూ..జ‌గ‌న్ ధ్వ‌జ‌మెత్తుతున్నారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో అక్ర‌మ అరెస్టుల‌కు నిర‌స‌న‌గా ఢిల్లీ వేదిక‌గా జ‌గ‌న్ ధ‌ర్నా చేయాల‌ని భావిస్తున్నారు. అరెస్టుల విష‌యంలో జాతీయ మీడియా మ‌ద్దతు తీసుకుని ఆయ‌న కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌ట్టాల‌ని చూస్తున్నార‌ట‌. అయితే..ఈ విష‌యం బూమ్‌రాంగ్ అవుతుంద‌ని కొంద‌రు పార్టీ నాయ‌కులు అంటున్నారు. మ‌ద్యం కుంభ‌కోణం విష‌యంలోనే ఢిల్లీలోని ఆప్ ప్ర‌భుత్వం కూలిపోయింద‌ని, మ‌ద్యంలో ఎటువంటి కుంభ‌కోణాలు జ‌రిగాయో దేశం మొత్తానికి తెలుసున‌ని, ఈ విష‌యంలో ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి క్రేజీవాల్‌, ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా ఎంత అప్ర‌ఖ్యాతి మూట‌గ‌ట్టుకున్నారో..ఇప్పుడు జ‌గ‌న్ కూడా అదే విధ‌మైన ప‌రిస్థితిలో ఉంటార‌ని, ఇక్క‌డ జ‌రిగిన బాగోతం..ఢిల్లీలో ధ‌ర్నా చేస్తే..జాతీయ స్థాయిలో ప‌రువుపోతుంద‌ని కూడా వారు హెచ్చ‌రిస్తున్నార‌ట‌. మ‌ద్యం షాపుల్లో డిజిట‌ల్ పేమెంట్ ఎందుకు తీసుకోలేద‌ని చెప్పాల‌ని జాతీయ‌స్థాయి మీడియా ప్ర‌శ్నిస్తే ఏమి స‌మాధానం చెబుతారంటూ వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఎందుకు ఇక్క‌డ పోయిన ప‌రువు చాల‌లేదా..? అక్క‌డ కూడా తీసుకోవాలా..అంటూ వారు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తం మీద‌..మ‌ద్యం అరెస్టుల‌పై జ‌గ‌న్ ఢిల్లీలో ధ‌ర్నా చేస్తే..ఆయ‌న మ‌రో సెల్ప్ గోల్ వేసుకున్న‌ట్లే...!