Janam Online

మ‌ద్యం స్కామ్‌లో మార్నింగ్ స్టార్‌...!?

వైకాపా అధికారం వెల‌గ‌బెడుతోన్న స‌మ‌యంలో అనంత‌పురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రంలో ఓ ఎమ్మెల్యే గుడ్‌మార్నింగ్ ధ‌ర్మ‌వ‌రం అంటూ...వీధి వీధి తిరిగేవారు. ఓ ఎమ్మెల్యే అలా ప్ర‌తి వీధి తిరిగి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డంపై అప్ప‌ట్లో భారీ చ‌ర్చే జ‌రిగింది. వీధుల్లో క‌నిపించిన మ‌హిళ‌ల‌ను పెద్ద‌మ్మా...అక్కా...చెల్లీ, త‌మ్ముడూ..త‌న కంటే చిన్న‌వాళ్ల‌యితే...అరే..ఒరే...అంటూ క‌లుపుకోలుగా మాట్లాడుతూ వీధుల్లో ఆ ఎమ్మెల్యే తిరుగుతుంటే..ఎమ్మెల్యే అంటే..ఇలానే క‌దా ఉండాల‌ని సామాన్యుల‌కు అనిపించేది. ఎవ‌రైనా స‌మ‌స్య గురించి చెబితే..అక్క‌డిక‌క్క‌డే సంబంధిత అధికారుల‌ను పిలిచి హ‌డావుడి చేసేవారు. పెన్ష‌న్ రాలేద‌య్యా..అంటే..వాలంటీర్ ఎక్క‌డా..? ఎందుకు పెన్ష‌న్ రాలేదంటూ..ఆరా తీసి త‌రువాత ఇపిస్తా..అంటూ... భ‌రోసా ఇచ్చుకుంటూ వెళ్లేవారు. అదే దారిలో ఎవ‌రైనా పిల్ల‌లు స్కూలుకు వెళ్ల‌క‌పోతే..అరే..స్కూల్‌కు ఎందుకు వెళ్ల‌లేదంటూ..మంద‌లించి, వారి త‌ల్లిదండ్రుల‌ను పిలిపించి..వారిని హెచ్చ‌రించేవారు. అప్ప‌ట్లో.. ఆ ఎమ్మెల్యే గుడ్‌మార్నింగ్ పోగ్రామ్ సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయింది. అయితే..ఇదంతా..ఒక వైపే..రెండో వైపు చూస్తే..ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న చెరువులు, కుంటలు, భూములు, ఇత‌ర‌త్రా ఆస్తులు కొట్టేయ‌డానికే..ఆయ‌న అలా తిరిగేవార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. త‌రువాత కాలంలో..ఆయ‌న భూ ఆక్ర‌మ‌ణ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆయ‌న చేసిందంతా షోనేన‌ని...ఆయ‌న‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌లేద‌ని త‌రువాత ఎన్నిక‌ల్లో తేలిపోయింది. ఆయ‌నో మార్నింగ్ స్టార్ అంటూ.. ఆయ‌న షోల గురించి ఇప్పుడు క‌థ‌లు ..క‌థ‌లుగా చెప్పుకుంటున్నారు. అయితే..ఈయ‌న కేవ‌లం..త‌న అవినీతి, అక్ర‌మాల‌ను ధ‌ర్మ‌వరం, అనంత‌పురానికే ప‌రిమితం చేయ‌లేద‌ట‌. రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోన్న మ‌ద్యం కేసులో ఈయ‌న‌కూ భాగ‌స్వామ్యం ఉందంటూ..విచార‌ణ సంస్థ‌లు ఆయ‌న పేరునూ విచార‌ణ జాబితాలో చేర్చారు. దీంతో..అయ్య‌వారి అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డింద‌ని కూట‌మి నేత‌లు చెబుతున్నారు. ఆయ‌నో షో మాస్ట‌ర్ అమాయ‌క ప్ర‌జ‌ల‌ను మార్నింగ్ షో పేరిట మోసం చేశార‌ని, అదీ కాకుండా అమాయ‌క ప్ర‌జ‌ల ర‌క్త‌మాంసాల‌ను పీల్చి పిప్పి చేసిన మ‌ద్యం కేసులో ఆయ‌నా ఉన్నారంటే..ఆయ‌న ఎటువంటి వాడో..ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తోంద‌ని కూట‌మి నేత‌లు అంటున్నారు. కాగా..ఈ మాజీ ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే మ‌ద్యం కుంభ‌కోణంలో వాటా ఉంద‌ని తాను అప్పుడే చెప్పాన‌ని, ఆయ‌న‌పై గెలిచి మంత్రి అయిన స‌త్య‌కుమార్ యాద‌వ్ చెబుతున్నారు. ఆయ‌న సంగ‌తి ఎన్నిక‌ల‌కు ముందే తెలుస‌న‌ని, ప్ర‌జ‌ల‌కూ తెలుసున‌ని, అందుకే ఆయ‌న‌ను ఓడించార‌ని ఆయ‌న అన్నారు. మొత్తం మీద‌..రాష్ట్రవ్యాప్తంగా మార్నింగ్ స్టార్‌తో పేరుతెచ్చుకున్న ఈ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మ‌ద్యం కుంభ‌కోణంలో కూడా ఉండ‌డంతో..ఆయ‌న‌ను అభిమానించే వాళ్లు కూడా ఔరా..మార్నింగ్ స్టార్ అంటూ..ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌వుతున్నారు.