ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. నిన్న ప్రారంభమైన ఈ టెస్ట్ ఈ రోజు సాయంత్రానికి నాలుగు ఇన్నింగ్స్‌లను పూర్తి చేసేసింది. క్రికెట్ చరిత్రలో ఇలా రెండు రోజుల్లో టెస్ట్ మ్యాచ్ ముగియడం ఇది 26వ సారి. పెర్త్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. అయితే..రెండో రోజు ఆస్ట్రేలియా బలంగా పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కు అవుట్ అయినా..ఇంగ్లాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో ఎక్కువ స్కోర్ చేయనీయలేదు. ఆసీస్ బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లును కుదురుకోనీయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన స్కాట్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీయగా, బోలాండ్ నాలుగు, బ్రెన్నెట్ మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను 164పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఆసీస్ ముందు 204 పరుగుల లక్ష్యం ఉంది. అయితే మొదటి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే ఆలౌట్ అయిన ఆసీస్ నాలుగో ఇన్నింగ్స్‌లో ఈ లక్ష్యాన్ని సాధించడం అంత సులువు కాదనే భావన వ్యక్తం అయింది. అయితే..ఓపెనర్‌గా వచ్చిన హెడ్ ఇంగ్లాండ్ బౌలర్లుకు చుక్కలు చూపించాడు. వరుసగా ఎడెపెడా బౌండరీలు కొడుతూ..టెస్ట్ మ్యాచ్‌ను ట్వంటీ, 20గా మార్చేశాడు. అతని విజృంభణతో ఆస్ట్రేలియా ఒకరమైన లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. ఈ క్రమంలోనే హెడ్ 83 బంతుల్లో 123 (16X4, 6X4) సెంచరీ సాధించగా, లబుషేన్ అర్థ సెంచరీ సాధించాడు. మొత్తం మీద తొలుత ఈ టెస్ట్‌లో వెనుకబడ్డ ఆస్ట్రేలియా తరువాత బలంగా పుంజుకుని బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది.