Janam Online

విజ‌యానంద్‌కు కొన‌సాగింపు...!

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్ ఈ నెలాఖ‌రుకు రిటైర్ కాబోతున్నారు. అయితే..ఆయ‌న స్థానంలో సీనియ‌ర్ ఐఏఎస్ సాయి ప్ర‌సాద్‌ను నూత‌న‌ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించ‌బోతున్నార‌ని అత్యున్న‌త వ‌ర్గాల్లో ప్ర‌చారం సాగుతోంది. అధికార కూట‌మిలో ప్ర‌ధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కూడా ఆయ‌న‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించాల‌నే భావ‌న‌తో ఉంది. ఆ పార్టీని స‌మ‌ర్థించే ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గం కూడా త‌మ సామాజిక‌వ‌ర్గానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ఇప్ప‌టి వ‌ర‌కూ ద‌క్క‌లేద‌ని, ఇప్పుడు ఆ అవ‌కాశం వ‌చ్చింద‌ని ఇప్పుడు సాయిప్ర‌సాద్‌ను సిఎస్‌గా నియ‌మించాల‌ని గ‌ట్టిగా కోరుతోంది. దీనిపై ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుపై ఒత్తిడి తెస్తోంది. వాస్త‌వానికి విజ‌యానంద్ కంటే ముందుగానే సాయిప్ర‌సాద్‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ఇవ్వాల‌ని అప్ప‌ట్లో ఈ సామాజిక‌వ‌ర్గం చంద్ర‌బాబుపై ఒత్తిడి తెచ్చినా బీసీ వ‌ర్గానికి చెందిన విజ‌యానంద్‌కే చంద్ర‌బాబు ప్రాధాన్య‌త ఇచ్చారు. అయితే..అప్ప‌ట్లో విజ‌యానంద్ త‌రువాత సాయిప్ర‌సాద్‌కు అవ‌కాశం ఇస్తాన‌ని చంద్ర‌బాబు ఆ సామాజిక‌వ‌ర్గానికి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని ఆయ‌న నెర‌వేరుస్తార‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది. దాదాపు 99శాతం సాయిప్ర‌సాద్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయిన‌ట్లేన‌నే అభిప్రాయాలు వివిధ వ‌ర్గాల నుంచి వ్య‌క్తం అవుతోంది. అయితే ప్ర‌స్తుత సిఎస్ విజ‌యానంద్‌కు మ‌రో ఆరు నెల‌లు పొడిగింపు వ‌స్తుంద‌ని ఆయ‌న‌ను స‌మ‌ర్థించే వ‌ర్గాలు ప్ర‌చారం చేస్తున్నాయి.


వాస్త‌వానికి విజ‌యానంద్ అంటే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా ఇష్టుమైన వాడే. విద్యుత్‌రంగంలో అపారనుభ‌వం ఉన్న ఆయ‌నంటే ఎందుకో చంద్ర‌బాబుకు చాలా మ‌క్కువ‌. ఇప్పుడా మ‌క్కువ‌తోనే..ఆయ‌న‌కు మ‌రో ఆరు నెల‌లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పొడిగింపు ఇస్తార‌నే ప్ర‌చారం ఉంది. అయితే..దాదాపు ఆయ‌న‌కు పొడిగింపులేన‌ట్లేన‌ని, నూత‌న సిఎస్‌గా సాయిప్ర‌సాద్ ఎంపిక కావ‌డం లాంఛ‌న‌మ‌నే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే..ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా విజ‌యానంద్‌కు స‌ర్వీసు పొడిగింపులేక‌పోయినా..ఆయ‌న‌ను విద్యుత్ శాఖ కార్య‌ద‌ర్శిగా కొన‌సాగిస్తారంటున్నారు. ఇప్పుడు ఆయ‌న ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి ప‌ద‌వితో పాటు విద్యుత్‌శాఖ కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. ఈనెలాఖ‌రుకు ఆయ‌న రిటైర్ అయినా..విద్యుత్‌శాఖ కార్య‌ద‌ర్శిగా ఆయ‌న కొన‌సాగుతార‌ని, ఆయ‌న స‌ర్వీసును పొడిగిస్తార‌నే ప్ర‌చారం ఉంది. గ‌తంలో స‌ర్వీసు నుంచి రిటైర్ అయిన రాజ‌శేఖ‌ర్‌ను ఎలా కొన‌సాగిస్తున్నారో..అదే విధంగా..విజ‌యానంద్‌ను కొన‌సాగిస్తారంటు న్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్ప‌టి నుంచి విజ‌యానంద్ విద్యుత్‌శాఖ‌ను చూస్తూనే ఉన్నారు. ముఖ్య‌మంత్రులు మారినా..ఆయ‌న పోస్టు మాత్రం మార‌డం లేదు. ఇప్పుడు ఆయ‌న రిటైర్ అయినా విద్యుత్‌శాఖ కార్య‌ద‌ర్శిగా ఆయ‌న‌నే చంద్ర‌బాబు కొన‌సాగిస్తార‌నే ప్ర‌చారం ఉంది. కాగా..విద్యుత్ ఛార్జీల పెంపు, విద్యుత్ ఒప్పందాల్లో అవినీతికి ఆయ‌నే కార‌ణ‌మ‌ని ఆయ‌న వ్య‌తిరేకులు ప్ర‌చారం చేస్తుంటారు. అయితే..విద్యుత్ రంగంలో గొప్ప సంస్క‌ర‌ణ‌లు తేవ‌డంలో..ఆయ‌న కీల‌క పాత్ర పోషించార‌ని ఆయ‌న అనుకూలురు చెబుతుంటారు. మొత్తం మీద ఆయ‌న స‌ర్వీసు నుంచి రిటైర్ అయినా.. విద్యుత్‌శాఖ‌లో ఆయ‌నే కీల‌కంగా వ్య‌వ‌రిస్తార‌నే అంచనాలు ఉన్నాయి. చూద్దాం ఏమి జ‌రుగుతుందో..?