ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. 2023 బ్యాచ్‌కి చెందిన IAS శిక్షణార్థులకు ఫేజ్-II శిక్షణ పూర్తయిన అనంతరం వారికి వివిధ జిల్లాలో సబ్ కలెక్టర్లగా నియమిస్తూ పోస్టింగ్‌లు ఇచ్చారు. చల్ల కల్యాణి, IAS (2023) అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్‌గా నియమించారు. అక్కడ పనిచేస్తోన్న వై.మేఘ స్వరూప్‌ను బదిలీ చేశారు. డమేరా హిమ వంశీ, IAS (2023)నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ పనిచేస్తోన్న పూజను బదిలీ చేశారు. పవార్ స్వప్నిల్ జగన్నాథ్, IAS (2023)ను పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ సబ్‌కలెక్టర్‌గాను, బొల్లిపల్లి వినుత్న, IAS (2023)ను ఏలూరు జిల్లా నూజివీడు సబ్‌కలెక్టర్‌గానూ, హెచ్.ఎస్. భావనా, IAS (2023) అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్‌కలెక్టర్‌గానూ, శుభం నొఖ్వాల్, IAS (2023) –అల్లూరి జిల్లా రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గానూ, వైశాలి ఆర్, IAS (2023) పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గాను నియమించారు. ఇప్పటి వరకూ ఆయా స్థానాల్లో బదిలీ అయిన వారికి తరువాత పోస్టింగ్‌లు ఇస్తారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.