తెనాలి యువకుడు క్రిష్ శాఖమూరుకు ప్రపంచస్థాయి గుర్తింపు
ప్రపంచ వేదికపై మెరిసిన యువ రచయిత
వేదాలు – విజ్ఞానం కలయికగా క్రిష్ రచనలు
బియాండ్ ది ట్రయాంగిల్స్: రహస్యాలతో నిండిన కథ
అజాద్: దేశభక్తి, ప్రతీకారం కలిసిన థ్రిల్లర్
భారతదేశం కర్మభూమి. సమస్త శాస్త్రాలకు పుట్టినిల్లు. నేడు ప్రపంచవ్యాప్తంగా వెలుగొందుతున్న ఆధునిక వైజ్ఞానిక శాస్త్ర మూలాలు మన దేశీయ ప్రాచీన వేద గ్రంథాలలోనే నిక్షిప్తమై వున్నది. ఈ విషయాన్ని ఎంతోమంది మహానుభావులైన ఋషులు, వైజ్ఞానికులు పలు సందర్భాలలో నిరూపించారు. ఇప్పుడా విజ్ఞానికి కల్పన జోడించి అందరికీ అర్థమయ్యే రీతిలో రచనలు సాగిస్తున్న ఓ 25 ఏళ్ల యువకుడికి తాజాగా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆ యువకుడి పేరే క్రిష్ శాఖమూరు. అసలు పేరు శాఖమూరు పవన్ కృష్ణ. క్రిష్ అనే కలం పేరుతో రచనలు చేస్తూ ఆ రంగంలో విశేషంగా రాణిస్తున్నారు.
యువ రచయిత క్రిష్ ప్రతిభా ప్రస్థానం
ఇప్పటివరకు తన రచనలను అధికారికంగా సమర్పించకపోయినా తన ప్రతిభా సామర్ధ్యాలతో వెలుగొందుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా గుర్తింపు పొందిన సంకలనాలలో చోటు సంపాదించిన క్రిష్ రచనలు ప్రత్యేకతను చేసుకున్నాయి. ప్రేమ, యాక్షన్, థ్రిల్లర్, పీరియాడిక్ డ్రామా, ఆధ్యాత్మికత వంటివి క్రిష్ రచనల్లో కానవస్తాయి. ప్రతిరోజూ భౌతిక శాస్త్రం, సంగీత విశ్లేషణ, ప్రపంచ నిర్మాణం వంటి అంశాలను అధ్యయనం చేసే క్రిష్ రచనల్లో సనాతన ధర్మపు ఆనవాళ్లు కానవస్తుంటాయి. శివుడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు ఉపదేశాలు తనకు ప్రేరణ అని చెబుతారు. తన సృజనాత్మకత తో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సేవచేయాలనే సంకల్పంతో ఉన్నట్టు క్రిష్ చెబుతారు.
స్క్రీన్‌ప్లే నవల – క్రిష్ ప్రత్యేక శైలి
" స్క్రీన్ ప్లే నావల్ " అనే వినూత్న సాహిత్య శైలి క్రిష్ ప్రత్యేకత. చలనచిత్ర దర్శకులకు ఇది ప్రక్రియ సిద్ధంగా వున్న " పిచ్ " తరహాలో ఉపయుక్తమవుతుందని క్రిష్ చెబుతారు. " ఈ తరహా రచనలు సినిమాకు డీఎన్ఏ వంటివి. గణితపరంగా కూర్పు చేసిన వేగం కారణంగా కథనం నేరుగా తెరపై సమయంగా మారుతుంది. దీనివల్ల పెద్ద బడ్జెట్ సినిమాలుగా వాటిని సులభంగా మార్పుచేయవచ్చు." అని క్రిష్ వివరించారు. క్రిష్ సినిమాటిక్ యూనివర్స్ లో రుద్రదేవ్ వంటి పాత్రలు సినిమాల తరహాలో అనుసంధానమైన విశ్వాన్ని సృష్టిస్తుంది అని క్రిష్ చెప్పారు.
ప్రధాన రచనలు – విభిన్న జానర్లలో మెరుపు
బియాండ్ ది ట్రయాంగిల్స్:
ఇది బెర్ముడా ట్రయాంగిల్ వంటి అంతుబట్టని రహస్యాలు, భారతీయ వారసత్వానికి చెందిన ప్రాచీన ఆయుధాలను చూపించే వేగవంతమైన కథ. దీనిలో ఏజెంట్ బెంగాల్ టైగర్ (రుద్రదేవ్), ఏజెంట్ డ్రాగన్ (మహాకాళ భైరవ), ఏజెంట్ సీ డైనో ( ఉగ్ర విరాట్), వంటి పాత్రలు ఉంటాయి. ఈ రచన హైడ్రోజన్ శాస్త్రాన్ని వేద తత్వంతో మిళితం చేస్తుందని క్రిష్ తెలిపారు.
అజాద్ :
ది రాథ్ ఆఫ్ ఏ ఘోస్ట్ (దేశభక్తి థ్రిల్లర్). రుద్రదేవ్ అనే కమెండో కథ. అతడు " ఆజాద్ " గా ఎదిగే ప్రతీకార గాథ. సైనిక వాస్తవికత తో పాటు భారతీయ ఇతిహాసాల గొప్పతనాన్ని కలిపిన కథ అని క్రిష్ వివరించారు.
కాస్మిక్ కెమిస్ట్రీ :
(ప్రేమ, ఆధ్యాత్మికత కలగలిపిన కథ). ఇది ప్రేమ ఆధ్యాత్మిక స్వరూపాన్ని చూపుతుంది. దీనిలోని పాత్రలజ్ఞ పార్థ్, ఆడా ల మధ్య సంబంధం నక్షత్రాల్లో రాసిన దివ్య రసాయనంగా చిత్రీకరించినట్టు క్రిష్ తెలిపారు.
కొత్త ప్రాజెక్టులు – భవిష్యత్ రచనలు
తాను ప్రస్తుతం ఫోరెన్సిక్ (ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ), యుఫోరియ (ఫాంటసీ తో కూడిన ప్రేమకథ), డిమానిక్ (హారర్ థ్రిల్లర్)లు రచిస్తున్నట్టు క్రిష్ వివరించారు.
అంతర్జాతీయ గుర్తింపు – అవార్డులు, ప్రశంసలు
క్రిష్ కు రొమాంటిక్ ఫాంటసీ విభాగంలో ఉత్తమ రచయితగా TRI లిటరేచర్ అవార్డ్ లభించింది. అజాద్ నవలకు పలు ప్రతిష్టాత్మక గుర్తింపులు లభించాయి. క్రిష్ కు ఆ విభాగంలో ప్రపంచంలోని అత్యుత్తమ వందమంది రచయితల్లో ఒకరుగా గుర్తింపు లభించింది. అంతర్జాతీయంగా యుకె లో " పోయెట్ ఆఫ్ ది సీజన్ " అవార్డు తో పాటు " ఇదం జగత్ " వంటి పత్రికలలో ప్రత్యేక స్థానం పొందింది.
భవిష్యత్ లక్ష్యం – గ్లోబల్ స్థాయిలో మల్టీవర్స్
" మల్టీవర్స్ ను ప్రపంచ స్థాయి ప్రమాణంగా నిలబెట్టి, కథ చెప్పే విధానంలో విప్లవాత్మక మార్పు తీసుకురావటం నా లక్ష్యం. సాహిత్యం, సినిమాల మధ్య అంతరాన్ని తగ్గిస్తూ ప్రపంచంలోని పెద్ద తెరలకోసం సిద్ధంగా ఉండే సృజనాత్మక అనుభవాలను అందించటమే తన లక్ష్యమని క్రిష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి లో జన్మించిన క్రిష్ తన సృజనాత్మక రచనల ద్వారా అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు పొందటం అభినందనీయం.