*విజయ్‌కుమార్‌రెడ్డితో కలిసి వేధింపులు..!
*ఉద్యోగులను రాచిరంపానపెట్టిన వైనం
*కార్యాలయంలోని ఉద్యోగులకు టెర్రర్
*ఒక్కమాట ఎదురు మాట్లాడితే అంతే...!
*డీడీ, జెడీ స్థాయి అధికారులపై కక్షసాధింపులు
*గుండె ఆపరేషన్ చేయించుకున్నా..కనికరం లేదు
*వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించిన ఉద్యోగి
*కూటమి రావడంతోనే జిఎడికి అటాచ్...!
*ఇప్పుడు మళ్లీ తిష్ట వేసేందుకు యత్నం
*మంత్రి ఓఎస్టీతో కుమ్మక్కై పోస్టింగ్ కోసం యత్నం
*సొమ్ముల కోసమో, కులం కోసమో..ఓఎస్టీ ఓవర్ యాక్షన్
*వైకాపాతో అంటకాగిన ఫలితాన్ని మరిచిన వైనం
*ఇప్పుడు పోస్టింగ్ కోసం కులం కార్డు...!
*ఆస్తులు పోగేసుకుని-నిరుపేద అరుపులు..!
*ఇంకా చెప్పలేని అకృత్యాలు ఎన్నెన్నో...!
వైకాపా అధికారంలో ఉన్న సమయంలో...రాష్ట్ర సమాచారశాఖను అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి అనే ఇండియన్ సర్వీస్ అధికారికి అప్పచెప్పేశాడు. సదరు అధికారి ఎన్నికలకు ముందే జగన్‌ను కలసి తనను రాష్ట్ర సమాచారశాఖ కమీషనర్‌గా నియమిస్తే..తాను వారికి ఎంత దోచిపెడతాడో..లెక్కలతో సహా వివరించి..జగన్‌ను సంతృప్తి పరిచిపోస్టింగ్ పొందారు. మనోడు రాష్ట్ర సమాచారశాఖ కమీషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే..రాష్ట్ర సమాచారశాఖకు రాజైపోయాడు. దీంతో..అక్కడి అధికారులు కొందరు సదరు విజయ్‌కుమార్‌రెడ్డి ప్రాపకం కోసం ఏమేమి చేయాలో అదంతా చేసేశారు. ఇక్కడ ఒకరు ఇద్దరు అని కాదు..దాదాపు అందరూ..ఆయనను ఏదో విధంగా సంతృప్తిపరిచారు. (కొందరికి తప్పలేదు..ఎందుకంటే..ఆయన తమ బాస్ కనుక..ఇష్టం లేకపోయినా.. వాళ్లు..ఆయన అడుగుజాడల్లో నడిచారు) అయితే వీరిలో కొందరు మాత్రం..మరీ దగ్గరైపోయారు. వైకాపా కార్యకర్తల కంటే..ఎక్కువగా వైకాపాకు పనిచేశారు. దీంతో...విజయ్‌కుమార్‌రెడ్డి మరీ సంతృప్తి పొంది వారి తన అనుంగు అనుచరుల్లా భావించి కార్యాలయాన్ని మొత్తాన్ని వారికే అప్పచెప్పేశాడు. దీంతో..ఈ ఇద్దరు అధికారులు రెచ్చిపోయారు. రేపన్నదే లేదన్నట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. చివరకు కార్యాలయంలో పనిచేస్తోన్న సీనియర్ అధికారులతో సహా..అందరినీ వేధింపులకు గురిచేవారు. సరే..వారికి అధికారం దక్కింది...చేసుకుంటున్నారనుకున్నా..కనీసం గౌరవ మర్యాదలు ఇవ్వకుండా ఏకవచనంలో.. దూషించారు. తమకు ఎదురు తిరిగితే అంతే సంగతులు. కార్యాలయంలో పనిచేస్తోన్న ఓ డిడిని ఇష్టారాజ్యంగా దూషించి అవమానాలు పాలు చేశారు. దాంతో ఆయన సెలవుపై వెళ్లాడు. అయినా వీరి కసి తీరలేదు. గుండె ఆపరేషన్ చేయించుకున్నా ఆయనను వదలకుండా వేధించారు. మరో ఉద్యోగిపై ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేశారు. దాంతో..అతను కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకోబోయారు. ఇలా ఒకటా..రెండా రాష్ట్ర సమాచార కార్యాలయం అంటే..తమ సామ్రాజ్యం అన్నట్లు వ్యవహరించారు. తాము కూర్చోమంటే కూర్చోవాలి..లేమంటే లేవాలన్నట్లు ఉద్యోగులతో వ్యవహరించిన వైనం కథలు..కథలుగా ఉద్యోగులు చెబుతారు.
కమ్మలైతే కార్యాలయంలోకి రావద్దు...!
విజయకుమార్‌రెడ్డి కమీషనర్‌గా ఉన్న సమయంలో..ఎవరైనా కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు..కార్యాలయానికి వెళితే..వారికి అవమానాలు..ఛీదరింపులే. ఎందుకు కార్యాలయానికి వచ్చారన్నట్లు.. ప్రశ్నార్థక చూపులు..? మీకేమి పని..అన్నట్లు..ఇక్కడకు ఎందుకు వచ్చారన్నట్లు..వ్యవహరించారు. అదో ప్రభుత్వ కార్యాలయమన్న సంగతిని మరిచి వేధింపులకు గురిచేశారు.
వసూళ్ల పర్వం...!
ఇప్పుడు తామేదో సత్యహరిచంద్రుల వారసులం....అసలు అవినీతికే పాల్పడలేదన్నట్లు ఇప్పుడు పోస్టింగ్ రాని అధికారి చెప్పుకుంటున్నారు. వాస్తవానికి సదరు అధికారి..వైకాపా వచ్చిన వెంటనే వసూళ్ల పర్వానికి తెరతీశారు. అంతకు ముందు టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఓ అధికారిని వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే చిత్తూరు జిల్లాకు బదిలీ చేశారు. దీంతో..ఆ అధికారి వెంటనే సదరు అధికారి కుటుంబ సభ్యులకు భారీగా సొమ్ములు ఇవ్వడంతోనే..ఆయనకు ప్రమోషన్ ఇచ్చి..మరీ పోస్టింగ్ ఇవ్వడంతో ఆయన డీడీగా రిటైర్ అయ్యారు. దీన్ని కాదనే దమ్ము ఉందా..? అప్పట్లో సదరు కుటుంబ సభ్యుల ఫోన్‌నెంబర్‌కే ఈ సొమ్ములు బదిలీ అయ్యాయి. దీనికి సంబంధించి..ఇప్పటికీ బ్యాంక్ లావాదేవీలు స్లిప్ భద్రంగా ఉంది. ఇక అక్రిడిటేషన్ల వ్యవహారం అందరికీ తెలిసిందే..? ఎంత మంది దగ్గర ఎంతెంత తీసుకుని అక్రిడిటేషన్లు ఇచ్చారో..దానికీ ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో ఎంత సొమ్ములు మారిందీ...? అసలు పనిచేయకుండానే జీతాలు తీసుకున్నవైనాలు..అన్నీ ఆధారాలతో సహా ఉన్నాయి. యాడ్ డిజైన్ పేరిట చేసిన బాగోతాలు, అవుట్ డోర్ ఏజెన్సీల నుంచి తీసుకున్న కమీషన్లు, ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్స్, పోస్టింగ్‌ల విషయంలో జరిగిన లావాదేవీలు, బంగారం పోయిన వైనాలు..ఇలా ఒకటేమిటి..? I&PR అంటే నేను...నేను అంటే..I&PR అన్నట్లు వ్యవహరించిన వైనాన్ని మరిచిపోయి...ఇప్పుడు మేము అమాయకులం..అంటూ కులం, లింగం..అంటూ అమాయకత్వాన్ని నటించడం ఎందుకు..? అసలు ఈ ప్రభుత్వం రాష్ట్ర సమాచారశాఖలో జరిగిన కుంభకోణాలపై నిజంగా విచారణ జరిపిస్తే..విజయ్‌కుమార్‌రెడ్డితో పాటు..వీళ్లందరూ ఖచ్చితంగా జైలుకు వెళతారు.
అరాచకశక్తికి పోస్టింగ్ ఎందుకు ఇవ్వాలి...?
దాదాపు ఐదేళ్ల పాటు రాష్ట్ర సమాచారశాఖను ఒంటిచేత్తో శాసించిన సదరు అధికారికి ఎందుకు ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వాలి..? సదరు అధికారి అక్రమాలు, అవినీతి తెలిసినా..ఆ అధికారిపై విచారణ జరగకుండా మంత్రి పార్థసారధి పోస్టింగ్ ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడుతున్నారు. సదరు అధికారి అక్రమాలను ఆయన తెలుసుకోలేదా..? కనీసం జర్నలిస్టులను గౌరవించలేని సదరు అధికారిని ఎందుకు మళ్లీ అక్కడకు తెచ్చి..రచ్చ రచ్చ చేసుకోవడం. ఎవరికీ కనీస మర్యాద ఇవ్వలేని అధికారిని శాఖకు భారం కాదా..? నిత్యం జర్నలిస్టులతో వ్యవహారాలు నడిపే శాఖలో సదరు అధికారి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రాదా..? సదరు అధికారి...వైకాపాకు అనుకూలం..మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కంకణం కట్టుకుని పనిచేస్తోన్న సంగతి తెలిసి కూడా మంత్రి పార్థసారధి ఎందుకు వారికి పోస్టింగ్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు? అప్పుడు గుర్తుకు రాని కులం..ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తుంది..? ఎస్సీ సామాజికవర్గమైతే..వాళ్లు చేసిన అరాచకాలు,అవినీతిని మరిచిపోవాలా..? శాఖలో ఉన్న మిగతా అధికారులు ఎస్సీలు కాదా..? సాటి అధికారులను ఉచ్చరించలేని బండబూతులు తిట్టిన అధికారిపై ఇంత ఉదాశీనత ఎందుకు..? సాటి అధికారులేనా...అప్పుడు సమాచారశాఖను రాసిచ్చిన విజయ్‌కుమార్‌రెడ్డిపైనా ఇదే బూతుల వర్షం కురిపిస్తే..తన బండారం ఎక్కడ బయటపడుతుందేమోన్న భయంతో....అన్నీ మూసుకుని కుక్కిన పేనులా ఉన్నవైనం అక్కడ ఉన్నవాళ్లందరికీ తెలుసు. అంతేనా...? ఓ 80ఏళ్ల సీనియర్ జర్నలిస్టుకు చెందిన పత్రికకు అక్రిడిటేషన్ ఇవ్వాలని (అన్ని అర్హతలు ఉన్నా..పైగా జిల్లా కలెక్టర్ విచారణ చేసి...అక్రిడిటేషన్లు ఇవ్వవచ్చు అని నిర్ధారించినా..ఇవ్వకుండా అడ్డుపడ్డారు) అప్పటి కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి..సదరు అధికారికి చెబితే..నువ్వెవడివి...? నాకు చెప్పడానికి..నాకు ఇష్టం వస్తే..ఇస్తాను..లేకుంటే లేదంటూ పెడసరంగా సమాధానం చెప్పిన వైనాన్ని సదరు జర్నలిస్టు లఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇలా ఒకటా..రెండా...? ఎన్నెన్నో..ఇలాంటి అధికారిని ఇప్పుడు మళ్లీ శాఖలోకి తెచ్చుకుంటారా.? పైగా సమాచారశాఖలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతున్న తరుణంలో..మాజీ కమీషనర్ అవినీతిలో భాగస్వాములైన వారి విషయంలో ఇంత సానుభూతి ఎందుకు..? ఇప్పటికైనా మంత్రి పార్థసారధి ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ప్రభుత్వానికి రాబోయే కాలంలో వచ్చే నష్టానికి మంత్రే కారణమవుతారనే విషయాన్ని గ్రహించాలి.