Janam Online

I&PR స్కామ్‌పై అతీగ‌తీ లేదు...!?

సాక్ష్యాల‌ను ధ్వంసం చేస్తోన్నా ప‌ట్టించుకోరా..?

అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్న‌వారికి మ‌ళ్లీ పోస్టింగ్‌లా...?

వాళ్ల‌కు పోస్టింగ్‌లు ఇస్తే...ద‌ర్యాప్తును సాగ‌నిస్తారా..?

మాజీ క‌మీష‌న‌ర్ విజ‌య్‌కుమార్‌రెడ్డి అవినీతిలో భాగ‌స్వాముల‌కు పెద్ద‌పీట‌

లోకేష్ పోస్టింగ్ ఇవ్వ‌మ‌న్నార‌ని బెదిరింపులు...!

సిఎంఓ చెప్పిందంటూ..మంత్రిపై ఒత్తిడి..

మంత్రి పార్థ‌సార‌ధిని ఒఎస్టీ త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా..?

శ‌ర‌వేగంగా క‌దులుతోన్న పోస్టింగ్ ఫైల్‌...?

టిడిపి వ్య‌తిరేక శ‌క్తుల‌కు పెద్ద‌పీట‌...!

గ‌త వైకాపా ప్ర‌భుత్వ పాపాల‌ను కూట‌మి ప్ర‌భుత్వం వెలికితీస్తోంది. అప్ప‌టి ముఖ్య‌మంత్రి  జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌న వ‌ర్గానికి చెందిన వారిని కీల‌క‌మైన స్థానాల్లో నియ‌మించుకుని, ల‌క్ష‌ల కోట్లు దోచుకున్న‌వైనం బ‌హిర్గ‌త‌మ‌వుతోంది. లిక్క‌ర్ స్కామ్‌, ఇసుక‌, మైనింగ్ ఇలా ఒక‌టేమిటి ప్ర‌తి డిపార్ట్‌మెంట్‌లో త‌న వాళ్ల‌ను, అదీ త‌న కులం వాళ్ల‌ను పెట్టుకుని అడ్డ‌గోలుగా దోచుకున్నార‌ని ఇప్పుడు సాక్ష్యాల‌తో బ‌య‌ట‌కు వ‌స్తోంది. వాళ్లు చేసిన పాపాల‌కు త్వ‌ర‌లో శ్రీ‌కృష్ణ జ‌న్మ‌స్థానానికి వెళ్లే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. జ‌గ‌న్ చేసిన స్కామ్‌ల‌కు స‌హ‌క‌రించిన వారిలో కొంద‌రు జైలుకు వెళ్ల‌గా మ‌రి కొంద‌రు మేనేజ్ చేసుకుని కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఇలా కాలం వెళ్ల‌తీస్తోన్న‌వారిలో రాష్ట్ర స‌మాచార‌శాఖ మాజీ క‌మీష‌న‌ర్ విజ‌య్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్నారు. ఆయ‌న అప్ప‌ట్లో I&PRలో అంతా తానై జ‌గ‌న్‌కు దోచిపెట్టి, ఆయ‌న ఆయ‌న‌కు వ‌త్తాసుప‌లికిన స‌మాచార‌శాఖ అధికారులు కొంద‌రు భారీగా దోచుకున్నారు. వారి దోపిడీకి ప్రాధ‌మిక ఆధారాలు ఉన్నాయ‌ని ఏసీబీ, విజిలెన్స్ ఇప్ప‌టికే వెల్ల‌డించింది. విజ‌య్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసుకోవ‌చ్చ‌ని కూడా హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది. అయితే..ఆయ‌నను కానీ ఆయ‌న‌కు స‌హ‌క‌రించిన అధికారుల‌పైన కానీ ఇంత వ‌ర‌కూ క‌ఠిన చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వ తీసుకోలేదు.


I&PR స్కామ్‌లో నిందితుల‌ను ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌న‌ని రాష్ట్ర స‌మాచార‌శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌ధి శాస‌న‌స‌భ సాక్షిగా సభ్యుల‌కు హామీ ఇచ్చారు. అయ‌తే ఏడాదిన్న‌ర కావ‌స్తోన్న ఇంత వ‌ర‌కూ ఆయ‌న త‌న హామీని నిల‌బెట్టుకోలేదు. హామీని నిల‌బెట్టుకోక‌పోయినా ఫ‌ర్వాలేదు..కానీ..విజ‌య్‌కుమార్‌రెడ్డితో అంట‌కాగిన అధికారుల‌కు మ‌ళ్లీ పోస్టింగ్ ఇస్తున్నారు. ఇప్ప‌టికే ఒక అధికారికి పోస్టింగ్ ఇవ్వ‌గా..ఇప్పుడు మ‌రో వివాదాస్ప‌ద అధికారికి పోస్టింగ్ ఇవ్వ‌డానికి అంతా రంగం సిద్ధం చేశారు. హ‌డావుడిగా పోస్టింగ్ ఫైలు మంత్రి పార్థ‌సార‌ధి వ‌ద్ద‌కు చేరింది. ఇందులో మంత్రి పేషీ అధికారి హ‌స్తం ఉంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్య‌మే. స‌ద‌రు ఓఎస్టీ ఎందుకు ఈ విష‌యంలో తొంద‌ర‌ప‌డుతున్నారో..అర్థం కావ‌డం లేదు. ఆయ‌న‌ను స‌ద‌రు అధికారి మేనేజ్ చేసింద‌ని స‌మాచార‌శాఖ అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. స‌ద‌రు వివాదాస్ప‌ద అధికారి చ‌రిత్ర ఆయ‌న‌కు తెలుసో లేదో..ఒక‌వేళ తెలిసినా..ఆయ‌నను ఏదో ర‌కంగా లొంగ‌దీశార‌ని, దాంతో స‌ద‌రు అధికారి మంత్రి వ‌ద్ద‌కు స‌ద‌రు అధికారి పోస్టింగ్ ఫైల్‌ను పంపించార‌ని, నేడో..రేపో దానిపై ఉత్త‌ర్వులు వ‌స్తాయంటున్నారు.


I&PR స్కామ్‌లో కీల‌క‌మైన విజ‌య్‌కుమార్‌రెడ్డికి అత్యంత స‌న్నిహిత అధికారి అయిన స‌ద‌రు అధికారికి ఎందుకు మ‌ళ్లీ ఇదే శాఖ‌లో పోస్టింగ్ ఇవ్వాలి. స‌ద‌రు అధికారి మ‌ళ్లీ శాఖ‌లోకి వ‌స్తే..ఇప్పుడు జ‌రుగుతోన్న విచార‌ణ‌కు ఆటంకం క‌ల‌గ‌దా..?  దీనిపై మంత్రి వివ‌ర‌ణ ఇవ్వాలి. అసలు స‌ద‌రు అధికారి కానీ..ఇత‌ర అధికారుల‌కు కానీ స్కామ్‌తో సంబంధం లేద‌ని విచార‌ణ జ‌రుపుతోన్న విచార‌ణ సంస్థ‌లు ఏమైనా స‌ర్టిఫికేట్ ఇచ్చాయా..?  లేదు క‌దా..మ‌రి ఎందుకు వాళ్ల‌ను మ‌ళ్లీ శాఖ‌లోకి తీసుకురావ‌డం..?  వారు వ‌స్తే..విచార‌ణ‌ను ప్ర‌భావితం చేయ‌రా..? మ‌రి ఇవ‌న్నీ మంత్రి పార్థ‌సార‌ధికి తెలియ‌దా..?  పైగా స‌ద‌రు అధికారుల‌కు వైకాపా ముద్ర ఉన్న సంగ‌తి తెలియ‌దా..?  వాళ్ల గ‌త చ‌రిత్ర తెలియ‌దా..? ఓఎస్టీ విష‌యంపై ఇప్ప‌టికే ప‌త్రిక‌ల్లోనూ, ఇత‌ర మాధ్య‌మాల్లోనూ విరివిగా వార్త‌లు వ‌చ్చాయి. అయినా..స‌ద‌రు ఓఎస్టీపై ఈగ వాల‌డం లేదు. మేమేనా..తింటోంది...లోకేష్‌, చంద్ర‌బాబు తిన‌డం లేదా..? అంటూ స‌ద‌రు అధికారి..ఇష్టారాజ్యంగా ప్రేలాప‌ణ‌లు పేలుతున్నారు..? ఈ అధికారి గ‌త చ‌రిత్ర అంతా అవినీతి మ‌య‌మే. గ‌తంలో ఆయ‌న వివిధ ప్రాంతాల్లోప‌నిచేసిన‌ప్పుడు సొమ్ములు లేనిదే..ఫైలును ముందుకు జ‌ర‌ప‌ర‌ని, భారీగా నిధులు ముట్టిన త‌రువాతే..ఫైలు ముందుకు క‌దులుతుంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాగా..ఈ వ్య‌వ‌హారంలో...ఎందుకు..మంత్రిని ఆయ‌న త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారో..తెలియ‌డం లేదు..?

లోకేష్ పేరు చెప్పి బెదిరింపులు...!

కాగా అత్యంత వివాదాస్ప‌ద అధికారిగా పేరున్న అధికారి విద్యాశాఖ మంత్రి, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కుమారుడు లోకేష్ పేరుతో బెదిరింపుల‌కు దిగుతున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. త‌న‌కు లోకేష్ పోస్టింగ్ ఇవ్వ‌మ‌ని అధికారుల‌కు చెప్పార‌ని, మీరు క‌నుక పోస్టింగ్ ఇవ్వ‌క‌పోతే..మీ సంగ‌తి లోకేష్ వ‌ద్ద తేలుస్తాన‌ని అధికారుల‌ను స‌ద‌రు అధికారి బెదిరిస్తున్నార‌ని తెలుస్తోంది. 

సిఎంఓ పేరునూ వాడుతున్న వైనం...!

మ‌రోవైపు స‌ద‌రు అధికారి సిఎంఓ అధికారి పేరును వాడుతున్నారు. సిఎంఓ అధికారి త‌న‌కు పోస్టింగ్ ఇవ్వ‌మ‌ని చెప్పార‌ని, ఒక‌వేళ పోస్టింగ్ ఇవ్వ‌క‌పోతే..ఆయ‌నతో చెప్పి మీ అంతు చూస్తాన‌ని బెదిరింపుల‌కు దిగుతున్నార‌ట‌. మ‌రి సిఎంఓలో ఏ అధికారి చెప్పారో..తెలియ‌దు కానీ..I&PRలో స‌ద‌రు అధికారి నిర్వాకం చూసిన ఏ అధికారి అయినా..స‌ద‌రు అధికారికి పోస్టింగ్ ఇవ్వ‌మ‌ని చెప్ప‌రు. రాష్ట్ర స‌మాచార‌శాఖ‌లో స‌ద‌రు అధికారి ఐదేళ్ల పెత్త‌నం, అజ‌మాయిషీ, ఒంటెత్తుపోక‌డ‌ల‌ను చూసిన ఉద్యోగుల్లో దాదాపు 99శాతం మంది స‌ద‌రు అధికారికి పోస్టింగ్ ఇవ్వ‌వ‌ద్ద‌నే చెబుతున్నారు. ఒక‌వేళ పోస్టింగ్ ఇవ్వాల్సి వ‌స్తే..వేరే శాఖ‌కు స‌ద‌రు అధికారిని బ‌దిలీ చేయాల‌ని కోరుతున్నారు. ఆ అధికారి మ‌ళ్లీ శాఖ‌లోకి ప్ర‌వేశిస్తే..రాష్ట్ర స‌మాచార‌శాఖ అల్ల‌క‌ల్లోలం అవుతుంద‌ని, వైకాపా వాళ్ల‌దే శాఖ‌లో పెత్త‌నం అవుతుంద‌ని స‌మాచార‌శాఖ అధికారులు అంటున్నారు. మొత్తం మీద స‌ద‌రు అధికారి పోస్టింగ్‌, ఇప్ప‌టికే ఇచ్చిన పోస్టింగ్‌లు వ‌ల్ల శాఖ తీరు స‌రిగా లేద‌నే అభిప్రాయాలు జ‌ర్న‌లిస్టు వ‌ర్గాల్లో వ్య‌క్తం అవుతున్నాయి. I&PR స్కామ్‌పై ఎవ‌రినీ వ‌దిలేది లేద‌ని, అప్ప‌ట్లో అసెంబ్లీలో గంభీరంగా ప్ర‌క‌టించిన మంత్రి కొలుసు పార్థ‌సార‌ధి క‌ళంకితులకు పోస్టింగ్ ఇస్తే..దాన్ని ఏ విధంగా స‌మ‌ర్థించుకుంటారో..చూడాలి. వాస్త‌వానికి ఆయ‌న నెమ్మ‌ద‌స్తుడు, మంచి మ‌నిషి అని కృష్ణాజిల్లాలో పేరుంది. అయితే..ఓఎస్టీని గుడ్డిగా న‌మ్మి..ఆయ‌న చుల‌క‌న అవుతున్నార‌ని, ఇప్ప‌టికైనా..ఈ విష‌యంలో ఆయ‌న నిజానిజాలు తెలుసుకోవాలని స‌మాచార‌శాఖ అధికారులు కోరుతున్నారు. గ‌తంలో స‌ద‌రు వివాదాస్స‌ద అధికారి వ్య‌వ‌హ‌రించిన తీరుతో..శాఖ‌లోని ఒక అధికారి ఆత్మ‌హ‌త్య చేసుకోబోయారు. అప్ప‌ట్లో ఆ అధికారి వేధింపులు తాళ‌లేక‌..ఉద్యోగులంతా మాట్లాడుకోవ‌డానికి బాత్‌రూమ్‌ల వ‌ద్ద‌కు చేరుకునేవారంటే..స‌ద‌రు అధికారి వేధింపులు ఏర‌కంగా ఉన్నాయో మంత్రి అర్థం చేసుకోవాలి. ఇప్ప‌టికైనా..నిజానిజాలు తెలుసుకుని..స‌ద‌రు అధికారిని శాఖ నుంచి బ‌య‌ట‌కు పంపించాల‌ని వారంతా ముక్త కంఠంతో కోరుతున్నారు.