Janam Online

IAS అధికారులకు పోస్టింగ్‌లు

అమరావతి, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ‌తంలో బ‌దిలీ చేసిన కొంద‌రు అధికారుల‌కు ఈ రోజు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ జెన్కో మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా ఎస్‌.నాగ‌ల‌క్ష్మిని నియ‌మించారు. సి.ప్ర‌శాంతిని పున‌రావాస డైరెక్ట‌ర్‌గానూ, బి.ఆర్‌.అంబేద్క‌ర్‌ను స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేష‌న్ జ‌న‌ర‌ల్‌గానూ, శ్రీ‌ధ‌ర్ చ‌మ‌కూరిని ఎక్సైజ్ & ప్రొహిబిషన్ డైరెక్టర్‌గా నియ‌మించారు.  ఇక అమిలినేని భార్గవ్ తేజ (IAS-2018) ను మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార (APCRDA) అదనపు కమిషనర్‌గా నియమించారు.  కట్ట సింహాచలం (IAS-2019) ను ఖాదీ & గ్రామీణ పరిశ్రమల బోర్డు (KVIB) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, మోగిలి వెంకటేశ్వర్లూ (IAS) ను నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమించారు. ఈ నియామకంతో పాటు, డా. మల్లికార్జున ఎ. (IAS-2012) కు బి.సి. సంక్షేమ డైరెక్టర్ బాధ్యతలతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం బదిలీ అయి కొత్త పోస్టింగ్ ఇవ్వని అధికారుల నియామక ఉత్తర్వులు త్వరలో విడిగా జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.