WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఏడుగురు మంత్రులు ఔట్‌...!

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ పునర్‌వ్వస్తీకరణ ఎప్పుడు చేసినా భారీగా మార్పులు చేర్పులు చేపట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారట. ఈ మార్పులు ఆషామాషీగా కాకుండా ఎన్నికల మంత్రివర్గంగా ఉండాలని ఆయన భావిస్తున్నారట. ఇప్పటికే పలువురు మంత్రుల పనితీరుపై ఆయన రహస్యంగా విచారణ జరిపించి నివేదికను తెప్పించుకున్నారు. కులపరంగా ఎవరెవరిని తప్పించాలి...వారి స్థానంలో అదే కులానికి చెందిన వారిలో ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై ఆయన కసరత్తు చేస్తున్నారట. ఇప్పుడు మంత్రి వర్గంలో ఉన్న పలువురు మంత్రుల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి అనేక సందర్బాల్లో వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయకుండా...స్వంతంగా ఆస్తులు పెంచుకునేందుకు ప్రయత్నించినవారి చిట్టాను ఆయన తయారు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ దసరా లోపు ఎప్పుడైనా జరగవచ్చని అధికారపార్టీవర్గాలు భావిస్తున్నాయి. ఈ విస్తరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. కానీ..మార్పులు చేర్పులు ఉంటాయని సంకేతాలు ఇస్తున్నారు. ముగ్గురు మహిళా మంత్రులను తొలిగించే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వీరి పనితీరుపై ఇంటిలిజెన్స్‌ నివేదకను చంద్రబాబు తెప్పించుకున్నారు. రాజకీయ చైతన్యం కల్గిన గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల పనితీరుపై అటు 'జనం' ఇటు 'చంద్రబాబు' ఆగ్రహంగా ఉన్నారు. వారి కుటుంబ సభ్యుల వ్యవహారశైలి ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపింది. దీంతో వీరిద్దరిపై వేటు ఖాయమనే ఆయా వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్రను తప్పించేందుకు రంగం సిద్ధమైంది. ప్రకాశం జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి శిద్ధారాఘవరావును తప్పించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరెవరిని మంత్రి పదవి నుంచి తొలగిస్తారో అదే సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలను మంత్రి పదవుల్లోకి తీసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని వారిని కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేకపోలేదని విశ్వసనీయవర్గాల సమాచారం.

(3152)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ