WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రాజు'కు 'అంబానీ'ల అండ...వేటు వేసే ధైర్యం 'బాబు'కుందా...?

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నియమింపబడిన ఒక ఐఎఎస్‌అధికారిని ఎప్పటి నుండో బదిలీ చేయాలని చంద్రబాబు భావించినప్పటికీ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అడ్డుపడి ఒత్తిడి తెచ్చి ఆ అధికారి బదిలీని నిలిపివేయించారు. దీంతో ఆ అధికారి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఓ బాస్‌ ఉన్నా...ఈ అధికారి పట్టించుకోరు. ఆయనకు ఉన్న అధికారాలు వేరు...నాకున్న అధికారాలు వేరు..ఆయనకు ఎవరు సిఫార్సులు ఉన్నా నేను పట్టించుకోను...నాకు అనేక మంది ప్రముఖుల అండదండలు ఉన్నాయి. నన్ను ప్రస్తుత పోస్టు నుండి తప్పించకుండా వాళ్లే చూసుకుంటారని గర్వంగా చెబుతున్నారా అధికారి. ఇంతకీ ఆ అధికారి ఎవరో తెలుసుకోవాలని ఉందా? ఆయనే తిరుమల జెఇఒగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసరాజు. సమర్థవంతుడిగా ఏనాడూ పేరు తెచ్చుకోలేదు..అయినప్పటికీ ఎవరెవరిని ఎప్పుడు ఆకట్టుకోవాలో ఆయనకు తెలిసినట్లుగా మరే అధికారికి తెలియదు. 'కిరణ్‌కుమార్‌రెడ్డి' ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనుక ఉండి చక్రం తిప్పిన సోదరుడు ఈ అధికారికి క్లాస్‌మేట్‌ అట. ఇంకేం ఉంది...మెల్లగా పావులు కదిపారు..తమ్ముడి సిఫార్సుతో అన్నపై ఒత్తిడి తెచ్చి తిరుమల కొండపై తిష్టవేశారు. అప్పట్లో చంద్రబాబు ప్రతిపక్షనాయకునిగా తిరుమలకు వచ్చినప్పుడు కనీస మర్యాద పాటించలేదు. వ్యక్తిగతంగా కలిసేందుకు 'శ్రీనివాసరాజు' నిరాకరించారని ఉద్యోగవర్గాలు బాహాటంగానే దుయ్యబట్టాయి. ఇంతలో అంతా తారుమారైంది. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు..ఇక శ్రీనివాసరాజు పని గోవిందా...అని రాజకీయ, ఉద్యోగవర్గాలు అనుకుంటున్న సమయంలో 'సుప్రీంకోర్టు' న్యాయమూర్తి ఒకరు అండగా నిలిచి ఆయన బదిలీని నిలిపివేయించారు. ఇలా కొంత కాలం గడిచింది. ఇంతలో 'సింగపూర్‌' మంత్రి ఈశ్వరన్‌ 'శ్రీనివాసరాజు'కు పరిచయమయ్యారు. ఇంకేం ఉంది...ఆయన అండదండలతో 'చంద్రబాబు'పై మళ్లీ ఒత్తిడి తెచ్చారు. బదిలీని నిలిపివేయించుకున్నారు..ఈ విధంగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరి ఆశీస్సులతో పోస్టుల్లో నియమింపబడ్డారు. ఇప్పటికీ ఆ పోస్టును కాపాడుకుంటూనే ఉన్నారు. తాజాగా ముఖేష్‌ అంబానీ సభ్యుల్లో ఒకరిని ఎలా ఆకట్టుకున్నారో తెలియదు కానీ...వారు ఈయనను కలవరించే పరిస్థితికి తెప్పించుకున్నారు. దీనిపై విచారించగా ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరు తమ బంధు,మిత్రులకు తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని చేయించమని శ్రీనివాసరాజుకు సిఫార్సు చేయగా ఆయన దగ్గర ఉండి వారికి సకల సౌకర్యాలతో స్వామివారి దర్శనం చేయించారు. గర్భగుడిలో పది నిమిషాలు వారిని నిలబెట్టి స్వామివారి ఆశీర్వదాలు ఇప్పించారు. ఇంకేముందీ...వారంతా పొంగిపోయి అంబానీ కుటుంబ సభ్యులను కలసి తమకు శ్రీనివాసరాజు ఏర్పాటు చేసిన స్వామిదర్శనం గురించి వర్ణించి చెప్పారు. దీంతో మనోడి దశ తిరిగిపోయింది. ఆంధ్రరాష్ట్రాన్ని పరోక్షంగా శాసిస్తున్న 'రిలయన్స్‌' గ్రూప్‌ తలచుకుంటే కాని పని ఏముంది. దీంతో మరోసారి శ్రీనివాసరాజు బదిలీ ఆగిపోయింది. తాజాగా ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు, ఆయన కుమారులు వ్యవహరించిన తీరుపై కఠినంగా వ్యవహరించలేకపోయిన శ్రీనివాసరాజుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. ఆ కోపాన్ని ఎలా చల్లార్చాలో శ్రీనివాసరాజుకు బాగానే తెలుసు. అయినా ఇప్పటి వరకు 'రమణదీక్షితుల'ను పిలిచి మందలించిన పాపానపోలేదు..ఈ సంఘటనలపై ఒక నివేదికను రూపొందించి ఇఒకు పంపాల్సిన బాధ్యత కూడా పాటించలేదు సదరు శ్రీనివాసరాజు. ఇఒ ఏ విధంగా స్పందించనున్నారో...ప్రభుత్వానికి ఎటువంటి నివేదికను పంపనున్నారో? ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారైనా శ్రీనివాసరాజును బదిలీ చేస్తారా...లేక అక్కడే కొనసాగిస్తారా...? ఇప్పటికే ఐదేళ్లు నిండి తిరుమలలో నిరాటకంగా...నిర్భయంగా జెఇఒగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు శ్రీనివాసరాజు.

(1601)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ