అమెరికా వస్తున్న విదేశీయులకు అధ్యక్షుడు ట్రంప్ కొత్త విధానం కొరకరాని కొయ్యగా మారుతున్నాయి. ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం, పాస్వర్డులను ఎయిర్పోర్టు అధికారులకు అప్పగించే కొత్త చట్టాన్ని అమలుచేసేందుకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం బ్రిటిష్ నుంచి అమెరికా వెళ్తున్న ప్రయాణికుల సోషల్ మీడియా పాస్వర్డ్స్, మొబైల్ నంబర్లు, వ్యక్తిగత సమాచారాన్ని అధికారులకు అప్పగించే ఓ దృడమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకు ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం సిద్ధంగా ఉందని గార్డియన్ పత్రిక పేర్కొంది. అంతేకాకుండా ప్రయాణికుల ఆర్థిక వివరాలు తెలుసుకోవడం, మనస్తత్వాలను అర్థం చేసుకునేందుకు వీలుగా ప్రయాణికుల వ్యక్తిగత సిద్ధాంతాలపై కఠినమైన ప్రశ్నలు సంధించనున్నారని, ఇదే విషయాన్ని ట్రంప్ పాలనా యంత్రాంగంలోని ఓ ముఖ్య అధికారి తెలిపారని పత్రిక పేర్కొంది. అమెరికా అనుబంధ దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్ పౌరులకు కూడా ఈ చట్టం త్వరలోనే వర్తించనుందని పత్రిక ప్రచురించింది. కాగా ఈ వార్తను బ్రిటిన్ దౌత్యకార్యాలయ అధికారులు ఖండించారు. ఇది అధికారిక సమాచారం కాదని గార్డియన్ పత్రిక మాత్రమే పేర్కొందని తెలిపారు. ఇదిలావుండగా అమెరికా విమానాశ్రయాల్లో ప్రయాణికుల సోషల్ మీడియా వివరాలను తెలిపాలనే నిబంధన ఇదివరకే తీసుకోచ్చారు. ఈ కొత్త చట్టంతో ఏకంగా పాస్వర్డులను కూడా అడగనున్నారని తెలియడం ప్రయాణికులకు మింగుడుపడని అంశంగా మారనుంది. అసలే అమెరికా విమానాశ్రయాల్లో ఎదురువుతున్న ఘటనలతో విసిగిపోతున్న ప్రయాణికులకు ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
క్షమించాలి మీరు వార్త మీద ఇష్టం లేదా వ్యతిరేకత ఇవ్వాలంటే మీరు లాగిన్ అయి ఉండవలెను .
LOGIN
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే ఇష్టపడి ఉన్నారు
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే వ్యతిరేకించి ఉన్నారు
అభిప్రాయాలూ