WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎన్టీఆర్ ద‌గ్గ‌ర నాకు అంత సీన్ లేదు...!

ఎన్టీఆర్ హయాంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాజాగా ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఎన్టీఆర్‌- లక్ష్మీపార్వతి పెళ్లికి సోమిరెడ్డే దగ్గరుండి వివాహా పెద్దగా వ్యవహరించారని అంటారు.. నిజమేనా?’’ అని యాంకర్ ప్రశ్నించగా సోమిరెడ్డి ఒక్కసారిగా నవ్వి.. ఇలా సమాధానం చెప్పారు.. ‘‘ఎన్టీఆర్ గారితో లక్ష్మీపార్వతికి నేను పెళ్లి చేయడమేంటి? అంత సీను లేదు. ఎన్టీఆర్ గారి దగ్గర మేమందరం చిన్నపిల్లలం మాదిరి ఉండేవాళ్లం. ఆయన నన్ను విపరీతంగా అభిమానించేవారు. అంతేకాని.. అంత దూరం లేదు. 

   మేము కర్నూలులో ఓ సభకు వెళ్లాం. మాధవరెడ్డిగారు, ఇంద్రారెడ్డిగారు, నేను కింద కూర్చుని ఉన్నాం. ఎన్టీఆర్‌గారు వేదిక మీదకు వచ్చారు. చంద్రబాబుగారితో పాటు ఒకరిద్దరు సీనియర్లు ఎన్టీఆర్‌గారి చెవిలో ఐదు.. పది నిమిషాలు ఏదో చెబుతున్నారు. దానికి ఆయన అడ్డంగా తల ఊపుతున్నారు. ఏం జరుగుతోందో మాకు అర్థం కాలేదు. కొంత సేపు తర్వాత ఆయన వీళ్లందరినీ కిందకు పంపించేశారు. ‘లక్ష్మీ.. పైకి రా’ అన్నారు. ఎవరు లక్ష్మో మాకు తెలీదు. లక్ష్మీపార్వతిగారు పైకి వచ్చారు. అప్పుడు పబ్లిక్‌గా అనౌన్స్ చేశాడు ఆయన.. ‘నా జీవితంలో నాకు తోడుగా నిలబడుతుంది. నాకు కాబోయే భాగస్వామి’ అని. మేమందరం అసలు షాక్ తిన్నాం. ఆ తర్వాత రెండు మూడు రోజులే ఎన్టీఆర్‌గారు పెళ్లి ప్రకటన చేశారు. అంతేగానీ.. ఆయన దగ్గరకు వెళ్లి, ఆయన పర్సనల్ విషయాలు మాట్లాడేంత అవకాశం మాకు లేదు.’’ అని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు.

 

(436)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ