WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'దేశం' వైపు 'మేకపాటి' చూపు...!

'జగన్‌'తో ముభావంగా ఉంటున్న నెల్లూరు ఎంపి 'మేకపాటి రాజమోహన్‌రెడ్డి' బిజెపిలో చేరతారని ప్రచారం జరగడం...దాన్ని ఆయన ఖండించకపోవడంతో నెల్లూరు జిల్లాలో దీనిపై అధికార,విపక్షాలనాయకులు అనుకూల వ్యతిరేక చర్చలు చేస్తున్నారు. భవిష్యత్‌లో టిడిపికి,బిజెపికి పొత్తు కుదరకపోతే పరిస్థితి ఏమిటి...? అని ఆలోచనలో పడ్డ మేకపాటి కొద్ది రోజుల నుంచి మౌనం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరితే ఆయనకు నెల్లూరు ఎంపి సీటు, సోదరుడుకు 'ఉదయగిరి' సీటు, ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కుమారునికి మరో నియోజకవర్గం కేటాయిస్తామని మధ్యవర్తులు రాయభారాలు నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. మేకపాటిని పార్టీలోకి తీసుకునేందుకు 'చంద్రబాబు' కూడా అభ్యంతరం చెప్పరు...ఆయనకు తిరిగి అధికారంలోకి రావడం ముఖ్యమని...ఎన్నికల్లో గెలిచేవారినే పోటీ చేసే అవకాశం కల్పిస్తానని చెప్పడం అందుకు నిదర్శనం. 

  2004,2009లల్లో జరిగిన ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి శేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించి 2014లో టిడిపి అభ్యర్థిపై ఓడిపోయారు. ప్రస్తుత ఉదయగిరి టిడిపి ఎమ్మెల్యే తన వ్యాపార లావాదేవీల కోసం బెంగుళూరులో ఉంటున్నారని, ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, ఆయనకు పోటీ చేసే అవకాశం మళ్లీ చంద్రబాబు ఇవ్వరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కలసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వ్యాపార లావాదేవీల్లో మునిగిపోతూ నియోజకవర్గ,ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే బెంగుళూరుకే పరిమితం అవడం దురదృష్టకరమని ఆపార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిడిపి అభ్యర్థిగా శేఖర్‌రెడ్డి పోటీ చేసే అవలీలగా గెలుస్తారని..స్థానిక సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. మేకపాటిని టిడిపిలో చేర్చుకోవడానికి చంద్రబాబు అంగీకరిస్తారని నెల్లూరు టిడిపికి చెందిన ముఖ్యనాయకులు మీడియాతో చెబుతున్నారు. నిన్నటివరకు నెల్లూరు బలహీనంగా ఉన్న టిడిపి పార్టీ...మాజీమంత్రులు ఆనం సోదరులు చేరి కొంచెం బలం పుంజుకోగా..ఇప్పుడు 'మేకపాటి' కుటుంబం చేరితే అదనపు బలం చేకూరుతుంది. అదే సమయంలో 'నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి' కూడా చేరతారని ప్రచారం జరుగుతుంది. ఈ మూడు కుటుంబాల ప్రభావంతో పాటు టిడిపి బలం కలస్తే జిల్లాను స్వీప్‌ చేయటం ఖాయమని ఆ జిల్లా టిడిపి నాయకులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో టిడిపికి 3మూడు నియోజకవర్గాలు దక్కాయని...భవిష్యత్‌ ఎన్నికల్లో వైకాపాకు ఆ మూడు సీట్లు కూడా దక్కవని వారు అంటున్నారు. ఏది ఏమైనా మేకపాటి చేరిక పార్టీకి లాభమేనని, మంత్రి సోమిరెడ్డి ఏకపక్షనిర్ణయాలకు, దూకుడుకు చెక్‌ పెట్టాలంటే వీరి చేరిక అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు.


(273)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ