WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆయన' కాలు పెడితే అంతే...!?

కొంత మందికి కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు ఉంటాయి...! వాటిని నమ్ముతారు.. ఆచరిస్తారు...! ఆ విశ్వాసాలతోనే మంచి జరిగితే...మన ఘనత..అదే చెడు జరిగితే...ఎదుటి వారి వల్ల..అంటూ ఉంటారు. ఎక్కువ మంది రాజకీయనాయకులు, అధికారులు ఇటువంటి నమ్మకాలను గుడ్డిగా ఆచరిస్తారు..ఇప్పుడు సచివాలయంలో ఓ ఉద్యోగి..గురించి ఇదే చర్చ జరుగుతోంది. ఆయనో ఉద్యోగి...! ఆయన ఎక్కడైతే పని చేస్తారో..అక్కడ..ఆయన బాస్‌కు నష్టం జరుగుతుందనే సెంటిమెంట్‌ ఎక్కువగా ఉంది. ఈ ఉద్యోగి మొదట మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌.కృష్ణారావు వద్ద పిఆర్‌ఒగా పనిచేశారు. ఒక ప్రభుత్వ సిఎస్‌ వద్ద పిఆర్‌ఒ విధానం మొదలైందే..ఈ వ్యక్తితోనే...! ఈ వ్యక్తి పిఆర్‌ఒగా పెట్టుకున్న తరువాత ఐవైఆర్‌ జాతకం మారిపోయిందట. ఆయన పదవీ కాలం అయిపోవడం, తరువాత బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి లభించడం, తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన విమర్శలు కురిపించడంతో ప్రభుత్వం ఆయన పదవిని పీకేసింది. దీంతో ఆయన వద్ద పిఆర్‌ఒగా ఉన్న ఈ వ్యక్తి 20 సూత్రాల పథకం ఛైర్మన్‌ 'సాయిబాబా' వద్ద పిఎగా చేరారట. ఈయన చేరిన దగ్గర నుంచి 'సాయిబాబా'కు ఏదీ కలసి రాలేదట. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు 'లోకేష్‌'కు తాను అత్యంత సన్నిహితుడినని చెప్పుకునే 'సాయిబాబా' పదవీ కాలం పూర్తి అయినా..ఆయనకు మరోసారి ఆ పదవిని పెంచడానికి 'సిఎం' ఆయన కుమారుడు ఒప్పుకోలేదట. ఇప్పటికీ తనకు మరో మారు అవకాశం వస్తుందనే ఆశతో 'సాయిబాబా' సచివాలయంలో తనకు కేటాయించిన రూమ్‌కు ఇంకా తన నేమ్‌ప్లేట్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఆయనకు మరోసారి అవకాశం రాదని ఇప్పుడిప్పుడే తేలింది. ఇదేమిటి తనకెందుకు పొడగింపు రాలేదో..అన్న సందేహం 'సాయి'ని పట్టిపీడించిందట. దీనికి ఆయన సన్నిహితులు సదరు పిఎగా పెట్టుకున్న వ్యక్తి 'లెగ్‌' మహిమ అని చెప్పారట. దీంతో ఇలా కూడా ఉంటుందా..అని ఆయన ఆశ్చర్యపోయారట. 

   'సాయి' తరువాత వంతు ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ 'వాసుదేవ దీక్షితులదట'. ఆయన వద్ద సదరు వ్యక్తి మళ్లీ పిఎగా చేరాడట. 'దీక్షితుల'కు ఆ దెబ్బ బాగానే తగిలిందని అనుకుంటున్నారట. మరోసారి ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా తనను సిఎం నియమిస్తారని 'దీక్షితులు' భావిస్తే చివరకు ఆయనకు సిఎం అపాయింట్‌మెంట్‌ కూడా దొరకలేదట. దీనంతటికి సదరు 'లెగ్‌' కారణమని ఆయన సన్నిహితులు చెబుతున్నారట. తాజాగా..ఇప్పుడు ఈ వ్యక్తి ఎమ్మెల్సీ 'పయ్యావుల కేశవ్‌' వద్ద చేరాడట. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలవలేక అపోసోపాలు పడి..చంద్రబాబును వేడుకుని ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న 'కేశవ్‌'కు ఇటీవలే చీప్‌ విప్‌ పదవి లభించింది. ఇప్పుడు ఈ 'లెగ్‌' తమ నాయకుడి వద్దకు చేరిందని..మరి తమ నేతకు ఎటువంటి కష్టాలు వస్తాయో..అంటూ ఆయన అనుచరలు వాపోతున్నారట. ఏది ఏమైనా మూఢ నమ్మకాలు..నమ్మే వారికి ఇది నిజంగా చేదువార్తే...!

(425)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ