WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

హోంమంత్రి పదవిపై కన్నేసిన 'నండూరి'...!

డిసెంబర్‌ మాసాంతానికి రిటైర్‌ కాబోతున్న డీజీపీ సాంబశివరావుకు సమాచారహక్కు ముఖ్య కమీషనర్‌ పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి 'చంద్రబాబు' సముఖత వ్యక్తం చేసినా... ఆ పదవి తీసుకునేందుకు 'సాంబశివరావు' ఇష్టపడడం లేదట. తనకా పదవి వద్దని...తాను రాజకీయాల్లోకి వస్తానని డీజీపీ సాంబశివరావు అంటున్నారట. రాజకీయాల్లో చేరి మంత్రి పదవి నిర్వహించాలనేది 'సాంబశివరావు' అభిమీష్టమట. అధికార టిడిపిలో చేరి..ఎమ్మెల్సీ అయి...చంద్రబాబు ఆశీస్సులతో హోంమంత్రి పదవి చేపట్టాలనేది 'సాంబశివరావు' ఆలోచనట. కాపు సామాజికవర్గానికి చెందిన 'నిమ్మకాయల చినరాజప్ప' హోంశాఖను నిర్వహిస్తున్న విషయం విధితమే. ఆయన ఎప్పటి నుంచో తనను ఆ శాఖ నుంచి తప్పించాలని కోరుతున్నారు. ఆ సామాజికవర్గ కోటాలో నియమింపబడాలని 'నండూరి' ఆశిస్తున్నారు. సమాచారహక్కు ముఖ్య కమీషనర్‌ పదవితో సంతృప్తి చెందాల్సిన 'నండూరి' రాజకీయాల వైపు కన్నువేయటంలో మర్మం ఏమిటో...? ఏ ఒక్కరికీ అంతుబట్టడం లేదు..! ఆయన మనసులో ఉన్న కోరికను 'చంద్రబాబు' వద్ద వ్యక్తం చేసిన విషయం బయటకు పొక్కింది. ఆ కారణాలతోనే ఇంతకు ముందు వాయిదా పడిన సమాచారహక్కు చట్టం ముఖ్య కమీషనర్‌ ఎంపికను నిర్వహించడానికి అదే కారణమని చెబుతున్నారు. మరి కొన్ని రోజులు గడిస్తే కానీ..'నండూరి' విషయం స్పష్టత రానుంది. ఆయన కోరికను 'చంద్రబాబు' అంగీకరిస్తారా..? తాను ఇవ్వాలనుకున్న సమాచార కమీషనర్‌ పదవికే 'చంద్రబాబు' ఆయనను పరిమితం చేస్తారా..? వేచి చూడాల్సిందే...!?

(407)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ