WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మర్డర్‌ చేస్తానన్న మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు...!

ఏదో విషయంపై రాజీ చేస్తానని తమను పిలిపించిన ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్‌ ఆయన చెప్పిన దానికి తాము అంగీకరించకపోతే మర్డర్‌ చేయిస్తానని బెదిరించారని సాక్షాత్తూ టిడిపి నాయకులే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొవ్వూరుకు చెందిన టిడిపి నాయకులు గణపతి, ప్రసాద్‌లు పోలీస్‌లకు ఫిర్యాదు చేయటం సంచలనం సృష్టించింది. మంత్రి పదవి వచ్చిన తరువాత 'జవహర్‌' వ్యవహారశైలిపై ఇంతకు ముందు పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి జీవం పోశామని, 'కొవ్వూరు' నియోజకవర్గంలో మంత్రి జవహర్‌ గెలుపుకు కష్టపడి పనిచేశామని, అయినప్పటికీ సీనియర్‌ నాయకులకు, కార్యకర్తలను ఆయన ఏదో విధంగా వేధిస్తున్నారని కొంత మంది నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తాజా కొందరు నాయకులను పిలిచి మర్డర్‌ చేయిస్తానని బెదిరించడం దానిపై వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంపై ముఖ్యమంత్రి దృష్టికి పలువురు తీసుకెళ్లారు. గాలి వాటంగా ఎమ్మెల్యేగా గెలిచిన 'జవహర్‌'కు మంత్రి పదవి ఇచ్చి మానెత్తిన 'చంద్రబాబు' గుదిబండ పెట్టారని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ...ఈసారి ఎన్నికల్లో ఆయన ఎలా గెలుస్తారో..చూస్తామని సవాల్‌ విసురుతున్నారు. ఏది ఏమైనా మంత్రిపై టిడిపి నాయకులు ఫిర్యాదు చేయటం, స్వంత పార్టీ నాయకులను మర్డర్‌ చేస్తానని బెదిరించడం ఇంతకుముందు ఎప్పుడూ చూడడలేదని, ఇటువంటి మంత్రిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే...పార్టీ నష్టపోతుందని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు,నాయకులు చెబుతున్నారు.

(238)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ