WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఇదేం ప్రచారం....'చిరంజీవీ'....!

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో కేవలం 9 ఓట్ల తేడాతో ఓడిపోయిన 'చిరంజీవి' తాజాగా తాను..మళ్లీ పోటీ చేస్తే ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని కొత్త పద్దతుల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన అప్పట్లో ఎన్నికల్లో ఓడినా...మంగళగిరి మున్సిపల్‌ ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చారు...అధినేత 'చంద్రబాబు'. అప్పట్లో...వైకాపా ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డితో కుమ్మక్కుయి ఓటమిని తెచ్చుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నాలుగేళ్ల కాలంలో మున్సిపల్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 'చిరంజీవి'పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఏపనికైనా...లంచం ఇవ్వనిదే పనిచేయరని...అధికార పార్టీ నాయకులే అనేక సందర్బాల్లో విమర్శలు చేశారు..అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. బిసి వర్గానికి చెందిన 'చిరంజీవి' లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించకుండా..స్వపక్షీయులు, విపక్షాల విమర్శలకు అవకాశం ఇచ్చి...మంగళగిరి నియోజకవర్గంలో బ్రష్టుపట్టిపోయారు. 

  మళ్లీ బిసీ కోటాలో పోటీ చేసే అవకాశం వస్తుందని...'చిరంజీవి' చెబుతున్నా...ఆయనపై మంగళగిరిలో ఉన్న వ్యతిరేకతను...అనేక సార్లు 'చంద్రబాబు' ఎత్తిచూపారు. తన అనుచరుల ద్వారా...మహిళల ద్వారా...ప్రచారం చేయించుకుంటున్నారు. గతంలో టిడిపి నాయకులైన మాజీ జడ్‌పి ఛైర్మన్‌ నాగభూషణం, స్థానిక నాయకుడు శ్రీనివాసరావులు వెన్నుపోటు పొడవడంతోనే తాను తొమ్మిది ఓట్ల తేడాతో ఓడిపోయానని 'చిరంజీవి' ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో...'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన ఆ ఇద్దరు నాయకులతో పాటు..మరో ఇద్దరువెన్నుపోటు పోడిచిన మాట వాస్తమేనని..టిడిపి సానుభూతిపరులు చెబుతూనే ఉన్నారు. మంగళగిరి నుంచి పోటీ చేసే అవకాశం 'చిరంజీవి'కి దక్కుతుందా..? లేక మరొకరికి దక్కుతుందా..? అనే ఉత్కంఠత నెలకొంది.

(250)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ