లేటెస్ట్

'వంశీ'కి రాజ్యసభ సీటు...యార్లగడ్డకు అసెంబ్లీ సీటు...!

త్వరలో పార్టీలోకి రాబోతున్న గన్నవరం ఎమ్మెల్యే 'వల్లభనేని వంశీమోహన్‌' రాజకీయ భవిష్యత్‌పై ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన తరువాత..తన పార్టీ మార్పుపై దీపావళి తరువాత చెబుతానన్న 'వంశీ' తనకు 'జగన్‌' ఏమీ హామీ ఇచ్చారనే దానిపై స్పష్టత ఇవ్వకపోయినా...ఆయన సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వివరాలు బయటకు వస్తున్నాయి. ఎవరైనా పార్టీ మారితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలన్న 'జగన్‌' నిర్ణయంతో 'వంశీ' తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని, తరువాత జరిగే ఉప ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వరని, ఆయనను రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరుగుతోంది. తాను ఖాళీ చేసిన సీటును తనపై పోటీ చేసి ఓడిపోయిన 'యార్లగడ్డ వెంకట్రావు'కు ఇచ్చే విధంగా 'జగన్‌' ఒప్పించారని తెలుస్తోంది. యార్లగడ్డ, వంశీలు ఇద్దరూ కలిసి పనిచేస్తే ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఘనవిజయం సాధిస్తారని, తరువాత జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో 'వంశీ'ని రాజ్యసభకు నామినేటెడ్‌ చేస్తారని తెలుస్తోంది. 'కమ్మ' సామాజికవర్గానికి చెందిన వారికి రాజ్యసభ సీటు ఇస్తే..ఆ వర్గంలో తనపై ఉన్న అభిప్రాయాలు తొలగిపోతాయనే భావన 'జగన్‌'లో ఉందంటున్నారు. అదీ కాక..తన పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలకు ఆయన దారి చూపినట్లు అవుతుందని, 'జగన్‌'ను నమ్ముకుని..వెళితే..ఆయన తమకు న్యాయం చేస్తారనే భావన వారిలో కల్గించడానికి 'వంశీ'కి రాజ్యసభ ఇవ్వాలనే నిర్ణయానికి 'జగన్‌' వచ్చారంటున్నారు. మొత్తం మీద..'వంశీ' రాజీనామాతో గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన 'యార్లగడ్డ'కు మళ్లీ పోటీ చేసే ఛాన్స్‌ దక్కబోతోంది.

(2927)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ