WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సాగునీటి కాంట్రాక్టర్లపై ఐటి దాడులు జరిగాయా...!?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోన్న పలు కాంట్రాక్ట్‌ సంస్థలపై ఇటీవల కాలంలో ఐటి దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా సదరు సంస్థలు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని అధికార పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబును వేధించడానికి ఈ కాంట్రాక్టర్లు తమ సహకరించడం లేదనే భావనతో వారిపై ఐటి దాడులు చేయించారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఈ రకమైన దాడులు చేయించారట. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నుంచి టిడిపి వైదొలిగిన తరువాత..బిజెపి పెద్దలకు, టిడిపి ముఖ్యులకు దూరం బాగా పెరిగింది. బిజెపిపై టిడిపి పోరాటాలకు దిగుతూ జాతీయ స్థాయిలో ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా ప్రధాని 'మోడీ'కి వ్యతిరేకంగా టిడిపి వ్యవహరిస్తున్న తీరును చూసి...కాంట్రాక్టర్ల వైపు నుంచి నరుక్కు రావాలని బిజెపి పెద్దలు నిర్ణయించారట. దానిలో భాగంగానే ఈ దాడులు చేయించారని చెబుతున్నారు.

   ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న 'పోలవరం' కాంట్రాక్టర్లపై బిజెపి పెద్దలు గురిపెట్టారట. దీనిలో అక్రమాలు జరిగాయని బిజెపి రాష్ట్ర నాయకులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. బిజెపితో టిడిపి తెంచుకున్న దగ్గర నుంచి..ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని భావిస్తోన్న బిజెపి పెద్దలు..ఆయా కాంట్రాక్టర్లను ఢిల్లీకి పిలిపించుకుని...సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలు, అవినీతి గురించి చెప్పాలని కోరాయి. దీనిపై కొందరు కాంట్రాక్టర్లు వారు అడిగిన సమాచారం ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే మరి కొందరు మాత్రం తాము చట్టబద్దంగానే చేశామని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా చట్టబద్దంగానే వ్యవహరించిందని, దీనిలో ఎటువంటి అక్రమాలు, అవినీతి జరగలేదని చెప్పాయి. తమకు ఇచ్చిన సాగునీటి కాంట్రాక్ట్‌ల వల్ల తమకు నష్టం వచ్చిందని, అయినా రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేశామని చెప్పారట. అయితే దీనిపై అసంతృప్తి చెందిన బిజెపి పెద్దలు ఆయా కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టడానికి ఐటి దాడులు చేయించారని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రాలో పనిచేస్తోన్న సాగునీటి కాంట్రాక్టర్ల కార్యాలయాలు అన్నీ హైదరాబాద్‌లోనే ఉండడంతో అక్కడ దాడులు జరిగాయని, వాస్తవానికి తెలంగాణ కీలకమైన ప్రాజెక్టులను చేస్తోన్న సంస్థలను ఐటి అధికారులు అంటు కోలేదని, కేవలం ఆంధ్రాలో పనులు చేస్తోన్న సంస్థలపైనే దాడులకు దిగారని తెలుస్తోంది.

(320)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ