లేటెస్ట్

‘ఈనాడు’పై ‘ఆళ్ల’ ఆగ్ర‌హం

అధికార వైకాపా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు చేస్తుంటే చూసి ఓర్వ‌లేక ప్ర‌ముఖ దిన‌ప్ర‌తిక ‘ఈనాడు’ అస‌త్య ప్ర‌చారాలు చేస్తోంద‌ని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే’ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి’ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈనాడు ‘రామోజీరావు’ ‘చంద్ర‌బాబు’కు మేలు చేసేందుకే ప‌నిక‌ట్టుకుని ప్ర‌భుత్వంపై అంబాండాలు రాస్తున్నార‌ని ఆయ‌న శుక్ర‌వారంనాడు విలేక‌రుల స‌మావేశంలో విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి’ వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి’ కుల‌,మ‌తాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రిస్తూ అంద‌రికీ మేలు చేస్తుంటే దాన్ని త‌ట్టుకోలేక ‘ఈనాడు’ వ‌క్ర‌భాష్యాలు చెబుతూ వార్త‌లు రాస్తుంద‌ని, ‘ఈనాడు’ ‘రామోజీరావు’కు వ‌య‌స్సు మీద‌ప‌డుతున్నా త‌ప్పుడు మార్గాల‌ను వ‌దులుకోవ‌డం లేద‌ని, ఆయ‌న త‌న స్వంత కులానికి మేలు చేయ‌డానికే ఇటువంటి వార్త‌లు రాస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.


నాడు-నేడు పథ‌కంలో భాగంగా ప్ర‌భుత్వం వేల‌కోట్లు ఖ‌ర్చు చేసి విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందిస్తుంటే అది భ‌రించ‌లేక చెత్త‌రాత‌లు రాస్తున్నార‌ని, గుండెపై చేయివేసుకుని, ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకుంటే నిజ‌మేమిటే తెలిసిపోతుంద‌ని, ఎందుకు ఈ విధ‌మైన త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారో వారే ప‌రిశీలించుకోవాల‌ని ఆయ‌న అన్నారు. గ‌త వారం రోజుల నుంచి ‘ఈనాడు’ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసుకుని వార్త‌ల‌ను ప్ర‌చురిస్తుంద‌ని, నిజాలు తెలుసుకోకుండా అస‌త్యాల‌ను  ప్ర‌చురించి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని, ప్ర‌జ‌లు నిజాల‌ను గ‌మ‌నిస్తున్నార‌ని, వారి ఆట‌లు సాగ‌వ‌ని ‘ఆళ్ల’ హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వం బ్యాంకుల వద్ద నుంచి అప్పులు తీసుకోనీయ‌కుండా ‘రామోజీరావు’ త‌న స్వంత లాయ‌ర్ తో కేసులు వేయిస్తున్నార‌ని, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంటే ఆయ‌న ఓర్వ‌లేక‌పోతున్నార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. 

అవి ఫేక్ ఆడియోలు...!

గ‌త కొంత‌కాలంగా వైకాపా నాయ‌కుల పేరిట ఫేక్ వీడియోల‌ను టిడిపి సోష‌ల్ మీడియాలో వ‌దులుతుంద‌ని, దీని వెనుక టిడిపి నాయ‌కుడు ‘లోకేష్’ ఉన్నార‌ని ‘ఆళ్ల’ చెప్పారు. నాయుకుల వ్య‌క్తిత్వాన్ని దెబ్బ‌తీయ‌డానికే వారు ఆ విధంగా చేస్తున్నార‌ని, దీని వెనుక ఎవ‌రు ఉన్నారో త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడ‌తామ‌ని ఆయ‌న చెప్పారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ