WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మా ఎమ్మెల్యే కనిపించడం లేదు...!

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన 'ముడియం శ్రీనివాసరావు' కనిపించడం లేదని త్వరలో పోలీసులకు నియోజకవర్గ ప్రజలు ఫిర్యాదు చేయబోతున్నారట. రెండేళ్లుగా ఎమ్మెల్యేగా ఆయన అందుబాటులో ఉండడంలేదని ఎప్పుడూ హైదరాబాద్‌లో ఉంటున్నట్లు వారి బంధువులు చెబుతున్నారని స్థానిక ప్రజలు అంటున్నారు. అదృష్టం కలిసివచ్చి ఎమ్మెల్యేగా విజయం సాధించిన 'ముడియం' దీపం..ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే 'దూర'లోచనతో పైరవీలకే పరిమితం అవుతున్నారట. ప్రతి పనికి ఒక రేటును నిర్ణయిస్తున్నారు. ఇప్పటికే బాగా వసూలు చేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. రోజుకో పనిని చేతపట్టుకుని అధికారులను 'ముడియం' కలుస్తుంటారు. ఎవరని అడిగితే తన దగ్గర బంధువులు అని చెబుతూ ఆయా పనులను చక్కబెట్టుకుంటూ బాగా వెనకేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. నెలకు పట్టుమని 10రోజులు కూడా 'ముడియం' ఉండరట. ఏదైనా పని ఉంటేనే ఏలూరుకు వస్తారు..అధికారులను కలుస్తారా...! కల్లబొల్లి మాటలు చెప్పి పనులు చక్కబెట్టుకుని ఒకరి రెండు రోజులు నియోజకవర్గానికి వెళ్లి మళ్లీ హైదరాబాద్‌ వస్తారు. ఇప్పటికే ఇంటిలిజెన్స్‌ విభాగం'ముడియం' వ్యవహారాన్ని పూర్తి వివరాలతో సిఎంఒకు అందజేశారట. పోలవరం ఎమ్మెల్యే 'ముడియం' ఎక్కడఉన్నారు? ఎప్పుడు వస్తారు? అని ఎవరైనా అడిగితే మీరు ఏపనిపై వచ్చారు... మా ఎమ్మెల్యేలతో పనేమిటి మీకు..ఆ పనికావాలంటే ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సిందే అని ఆయన బృందం ముక్కుసూటిగా చెబుతున్నారట. ఇదంతా తనకు తెలియదని ఎమ్మెల్యే ముడియం చెబుతున్నప్పటికీ నిప్పులేనిదే పొగరాదు కదా...!అని అధికారులు అంటున్నారు. యధా ఎమ్మెల్యే..తధా అనుచరలు..ఆయన పేరుతో అందిన వరకు దోచుకుంటున్నారు అనుచరులు..పనులు చక్కబెట్టుకుని బాగా వెనకేసుకుంటున్నా ఎమ్మెల్యే 'ముడియం'.సిఎం చంద్రబాబుకు ఇంతకు ముందే స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆయన 'ముడియం'ను మందలించడమే కాకుండా హెచ్చరించినప్పటికీ ఆయనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసేందుకు రంగం సిద్ధమైందట.

(534)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ