లేటెస్ట్

‘కొడాలి’కి ‘య‌ర‌ప‌తినేని’ స్ట్రాంగ్ వార్నింగ్

తెలుగుదేశం అధినేత ‘నారా చంద్ర‌బాబునాయుడు’, ఆయ‌న త‌న‌యుడు ‘లోకేష్’ పై ప‌దే ప‌దే నోరు పారేసుకుంటున్న రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ మంత్రి ‘కొడాలి’కి మాజీ ఎమ్మెల్యే ‘య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాస‌రావు’ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంద‌ని, తాము అధికారంలోకి వ‌చ్చిన గంట‌లోనే ‘అంకుశం’ స‌నిమాలో ‘రామిరెడ్డి’ని న‌డిరోడ్డుపై త‌న్నుకుంటూ ‘రాజ‌శేఖ‌ర్’ ఎలా తీసుకెళ్లాడో..తాము అదే విధంగా ‘కొడాలి నాని’ విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తామ‌ని ‘య‌ర‌ప‌తినేని’ హెచ్చ‌రించారు. తెలుగుదేశం పార్టీలో ‘చంద్ర‌బాబు’ ద‌య‌తో ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఆయ‌ననే దూషించ‌డంపై ‘య‌ర‌ప‌తినేని’ మండిప‌డ్డారు. ‘ఎన్టీఆర్’ కు ‘చంద్ర‌బాబు’ వెన్నుపోటు పొడిచిన రోజే ఆయ‌నను అంతం చేసి ఉండాల్సింద‌ని ఇటీవ‌ల ‘కొడాలి’ వ్యాఖ్యానించారు. దీనిపై టిడిపి నాయ‌కులు మండిప‌డ్డారు. ‘కొడాలి’కి గ‌ట్టిగా బ‌దులు ఇచ్చారు.


ఇన్నాళ్లూ ‘కొడాలి’ ‘చంద్ర‌బాబు’ను ఆయ‌న కుమారుడిని ఎన్ని ర‌కాలుగా దూషించినా టిడిపి నేత‌లు ఆయ‌న‌కు స‌రైన కౌంట‌ర్ ఇవ్వ‌లేదు. అయితే ఇప్పుడు గుర‌జాల మాజీ శాస‌న‌స‌భ్యుడు ‘య‌ర‌ప‌తినేని’ ఇచ్చిన కౌంట‌ర్ కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ‘య‌ర‌ప‌తినేని’ స‌రైన స‌మ‌యంలో స్పందించార‌ని ఇక‌మీద‌ట టిడిపి అధినేత‌పై కానీ, ఆయ‌న కుమారుడిపై కానీ ఇదే విధంగా రెచ్చిపోతే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని ‘య‌ర‌ప‌తినేని’ చేసిన హెచ్చ‌రిక సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మొత్తం మీద ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన రెండేళ్ల త‌రువాత టిడిపి నేత‌లు వైకాపా నేత‌ల‌పై ప్ర‌త్య‌క్ష‌పోరుకు దిగుతున్నార‌ని, ఇది ఆ పార్టీలో నెల‌కొన్న ఉత్సాహానికి సూచిక అని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ