WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆ నాణెం చెల్లుతుంది...!

మార్కెట్‌లో రూ.10నాణెం చెల్లదని జరుగుతున్న ప్రచారానికి ఆర్‌బిఐ అడ్డుకట్టవేసింది. రూ.10నాణెం చెల్లదని ఎవరో వాట్సాప్‌లో పెట్టిన పోస్టు ఇప్పుడు మార్కెట్‌లో గందరగోళానికి కారణం అయింది. అయితే నాణెం చెల్లదంటూ జరిగిన ప్రచారంతో ఇప్పుడు అవన్నీ మార్కెట్లో చెలామణికి వస్తున్నాయని కొందరు అంటున్నారు. మరి కొందరైతే వాటిని మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు. కాగా, దీనిపై లీడ్‌ డిస్ట్రిక్‌ మేనేజర్‌ ఫర్‌ బ్యాంక్స్‌ పంకజ్‌ సక్సేనా వివరణ ఇచ్చారు. రూ.10 నాణెం రద్దు చేస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించలేదని స్పష్టం చేశారు. నాణేలు చెల్లవంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. అలాగే వాటిని తీసుకోవడానికి తిరస్కరించిన వ్యాపారులు చట్టరీత్యా శిక్షారులని అన్నారు.

(253)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ