WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అక్కడ 'భర్త'లను చితకబాదేస్తున్న 'భార్యలు'...!

పురుషాధిక్య సమాజంలో భార్యలను భర్తలు ఘోరంగా హింసిస్తారని ప్రపంచమంతా భావిస్తోంది. మన దేశంలో కానీ, ఇతర దేశాల్లో కానీ శారీరకంగా బలమైన పురుషులు స్త్రీలపై ఆధిక్యం చెలాయిస్తారు..ఇది నిజం కూడా...అయితే ఆ దేశంలో మాత్రం సీన్‌ రివర్స్‌... భర్తలను భార్యలే హింసిస్తారు.. అదెక్కడను కుంటున్నారా? ఈజిఫ్ట్‌ దేశంలో భార్యలు భర్తలను చితకబాదేస్తారట. ఇక్కడ భార్య చేతిలో దెబ్బలు తినే భర్తలు తిరిగి వారిని కొట్టలేని పరిస్థితి ఉంది. వారిని ఒక మాట అనాలన్నా...తిరిగి చేయి చేసుకున్నా ఆ తరువాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అక్కడి చట్టాలు మగువలకు ఆ విధంగా రక్షణ కల్పించాయి. కానీ భార్య చేతిలో దెబ్బలు తినే భర్తలు వారిపై కేసు పెట్టడం మినహా ఇంకేమీ చేయలేరు.. ఫ్యామిలీ న్యాయస్థానం విడుదల చేసిన ఒక నివేదికలో 25% పైగా మహిళలు భర్తలను ఉతికి ఆరేశారని వెల్లడైంది. కొందరు మహిళలైతే భర్తలను బెల్ట్‌లతో బాదేస్తారాట... వారు తినే భోజనంలో నిద్రమాత్రలను కూడా కలుపుతుంటారట. ప్రపంచంలో భర్తలను హింస పెట్టే భార్యలు ఈజిఫ్ట్‌ మొదటి స్థానంలో ఉందట. ఆ తరువాత అమెరికా,బ్రిటన్‌లు తరువాత స్థానంలో ఉన్నాయి. కాగా భారత్‌లో కూడా 11శాతం మహిళలు భర్తలను హింసిస్తున్నారట. ఈజిఫ్ట్‌ దేశం మహిళలకు ఆ విధంగా చట్టం కల్పించగా, భారత్‌ దేశంలో కూడా గృహహింస చట్టం ద్వారా చాలా మంది భార్యలు భర్తలపై ఫిర్యాదు చేస్తున్నారు. ఈజిఫ్ట్‌లో 65శాతం మహిళలు విడాకులకు ధరఖాస్తు చేసుకుంటున్నారట. రాబోయే కాలంలో భారతదేశంలో అటువంటి పరిస్థితి ఎదురవుతుందేమో...!

(1078)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ