WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బ్యాంక్‌ డిపాల్టర్‌కు సర్వీసు పొడగింపా...?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిని నియమించే ముందు ఆయన గతంలో ఎలా పనిచేశారు? అవినీతి ఆరోపణలు ఉన్నాయా? అక్రమాలకు పాల్పడ్డారా? ఇతర ఆర్థిక నేరాలు చేశారా? అని ఇతరత్రా విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకుని ఆ పోస్టులో నియమించాల్సి ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన ఈ పదవిలో నియమించే అధికారిపై ఎటువంటి నిందారోపణలు ఉండకూడదు..ఇవన్నీ తెలుసుకున్నాకే సిఎం నిర్ణయం తీసుకోవాలి. కానీ సీనియార్టీ ప్రాతి పదికిన నిర్ణయాలు తీసుకుంటే అసమర్థులు, అక్రమార్కులు, అవినీతిపరులు, ఇతరత్రా ఆరోపణలు ఉన్నవారు పదవిలోకి వచ్చి ప్రభుత్వ ప్రతిష్ట మంటగలుపుతారు. తాజాగా అదే జరిగింది.. యూకో బ్యాంక్‌లో లోను తీసుకుని దానిని సకాలంలో చెల్లించకపోవడంతో కోర్టులో కేసులు ఎదుర్కొంటున్న అధికారినే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడమే పెద్ద తప్పు. అంతే కాకుండా మరో ఆరు నెలలు ఆయన సర్వీసును పొడిగించాలని కేంద్రానికి లేఖ రాసి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు మీద తప్పు చేస్తున్నారని సిఎంఒ వర్గాలు చెప్పుకుంటున్నాయి. బ్యాంక్‌కు సిఎస్‌ డిపాలర్ట్‌ అయిన విషయం ఇటీవల ఒక పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఈ పత్రిక కథనాన్ని అటు ప్రభుత్వం కానీ...ఇటు సిఎస్‌ కానీ ఖండించిన దాఖలాలులేవు. అంటే ఆ పత్రిక రాసింది నిజమేననా? లేక పట్టించుకోకపోతే వాళ్లు చేసేదేముందన్న బరితెగింపా? ఆధారాలతో ప్రచురించిన ఆ కథనంపై సిఎస్‌ ఇంత వరకూ నోరు మెదపలేదు.అంటే ఆ కథనం నిజమేనన్నమాట. మరి ఈ కథనం విషయం సిఎం చంద్రబాబు దృష్టికి వెళ్లలేదా? ఆయన దృష్టికి వెళ్లినా ఆయన అది పట్టించుకోకుండా సిఎస్‌ సర్వీసు పొడిగింపుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా? అంటే పట్టించుకోలేదనేదే నిజం..అందుకే ఆయన కేంద్రానికి సిఎస్‌ సర్వీసు పొడిగింపుపై లేఖ రాశారు. ఒక వైపు నీతి,నిజాయితీ అంటూ నిత్యం కబుర్లు చెప్పే 'చంద్రబాబు' ఇతరులను నిదించే అవకాశం ఎక్కడ ఉంది. రోజూ లేచిదగ్గర నుంచి 'జగన్‌' అవినీతిపరుడు...నేను నిజాయితీపరుడ్ని అంటూ ఒకటే భుజకీర్తులు తగిలించుకునే 'బాబు' తన సిఎస్‌ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..చర్యలు సంగతి పక్కన పెట్టినా ఆయనను ప్రోత్సహించడం ఎంత వరకు సబబు. మొత్తం మీద ఒక డిపాల్టర్‌కు మళ్లీ సర్వీసు పొడిగింపు ఇవ్వాలని 'చంద్రబాబు' నిర్ణయించడం అటు అధికారవర్గాల్లోనూ...ఇటు రాజకీయవర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. మొన్నటి వరకు ఇదే సిఎస్‌ను అర్దాంతరంగా తప్పించాలని భావించిన 'సిఎం' ఇప్పుడు ఆయనపై అంత ప్రేమ ఎందుకు ఒలకబోస్తున్నారో ఎవరికీ అంతుబట్టడం లేదు..? ఎవరి ఒత్తిడిలు పనిచేశాయో కానీ..లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? కొసమెరపేమింటంటే సిఎస్‌పై వస్తోన్న విమర్శలపై సిఎం చంద్రబాబు స్పందించకపోయినా.. కేంద్రం ఈ వ్యవహారంపై దృష్టిపెట్టబోతోందని విశ్వసనీయంగా తెలుస్తోంది.

(413)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ