WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నయీం' అండతో చెలరేగిన జర్నలిస్టులు...!

గ్యాంగ్‌స్టర్‌ 'నయూం' అండ చూసుకొని నల్లగొండ జిల్లాకు చెందిన జర్నలిస్టులు కొందరు చెలరేగిపోయారని ఇప్పుడు పోలీసుల విచారణలో తెలుస్తోంది. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన 'నయీం'కు జిల్లాకు చెందిన జర్నలిస్టులు బినామీలుగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో వివిధ పత్రికల్లో, టివీల్లో పనిచేసే దాదాపు 30మంది జర్నలిస్టులు 'నయీం'ఆగడాలకు సహకరించారని తద్వారా వీరు భారీగా ఆస్తులు పోగేసుకున్నారని విచారణలో తేలింది. 'నయీం' మరణం తరువాత వీరి గుండెల్లో రైలు పరుగెత్తుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరు ముగ్గురు మూడు టీవీ ఛానెల్స్‌లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరు 'నయీం' చేసే నేరాలకు సహకరించారని విచారణలో తేలడంతో వీరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. వీరు కాక 'యాదాద్రి'లో పనిచేస్తోన్న జర్నలిస్టులు, హైదరాబాద్‌,నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన పలువురు జర్నలిస్టులు కూడా 'నయీం'తో సంబంధాలు నెరిపినట్లు పోలీసులు ధృవీకరిస్తున్నారు. వీరిని త్వరలో విచారిస్తామని వారు చెబుతున్నారు.

(309)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ