WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నయీం' బాస్‌...మాజీ టిడిపి మంత్రి....!

గ్యాంగ్‌స్టర్‌ 'నయీం' వెనుక ఓ మాజీ మంత్రి హస్తం ఉందని పోలీసుల విచారణలో వెల్లడయిందని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెప్పారు. ఈ మాజీ మంత్రి అండ చూసుకునే 'నయీం' చెలరేగిపోయారని పోలీసువర్గాలు చెబుతున్నాయి. తమ కుటుంబసభ్యుడ్ని హతమార్చిన నక్సలైట్లు, వారి సానుభూతిపరులపై కక్ష తీర్చుకోవడానికి 'నయీం'ను ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత భవనగిరి ఎమ్మెల్యేను 'నయీం' ద్వారా హతమార్పించి... జరగబోయే బై ఎలక్షన్‌లో తాను పోటీ చేసి గెలవాలనేది ఆ మాజీ మంత్రి ప్లాన్‌ అని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ మాజీ మంత్రి ఎవరు అనేదానిపై పలు ఆసక్తి నెలకొంది. ఆ మాజీ మంత్రి టిడిపికి చెందిన వారని కొందరు అంటుండగా మరి కొందరు కాంగ్రెస్‌ నేత అని అంటున్నారు. అయితే టిడిపికి చెందిన నాయకుడే 'నయీం' వెనుక ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేతకు చెందిన కింది స్థాయి ప్రజాప్రతినిధులతోనూ 'నయీం' సంబంధాలు పెట్టుకున్నారని, వారంతా 'నయీం'కు అనుచరులుగా ఉన్నారనేది మరో సమాచారం. కాగా ఈ మాజీ మంత్రిపై స్పష్టమైన ఆధారాలు లభించాయని...మంత్రిని ఈ కేసులో ఎ-1గా చేర్చి అరెస్టు చేస్తారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.'నయీం'తో పలుసార్లు ఈ మాజీమంత్రి మాట్లాడినట్లు పోలీసులు ధృవీకరిస్తున్నారు. అంతే కాకుండ మంత్రి ల్యాండ్‌లైన్‌ నుంచి కూడా 'నయీం'తో సంభాషించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మంత్రి అరెస్టుకు రంగం సిద్ధమైంది. కాగా భువనగిరి ఎమ్మెల్యేను బెదిరించి రాజీనామా చేయించడం, లేదా హతమార్చాలని స్వయంగా ఈ మాజీ మంత్రి 'నయీం'ను ప్రోత్సహించినట్లు పోలీసులు విచారణలో కనుగొన్నారు. దీంతో ఆ మంత్రి అరెస్టు తప్పదని తేలిపోయింది.

(2222)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ