WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మాకేం...ఇస్తారో..చెప్పండి...!

విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమిస్తుందో స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. ఎపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా? లేక ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారా? అనే విషయంపై ఏదో ఒకటి తెలిపాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ప్రత్యేక హోదా ఇస్తామని నాడు రాజ్యసభ సాక్షిగా చెప్పారని, దీనిపై ఇప్పుడు బిజెపి మంత్రులు నోరు మెదపడం లేదని, కనీసం బుందేల్‌ఖండ్‌కు వలే ప్యాకేజీ ఇచ్చేటట్లయితే ఆ విషయమైనా చెప్పాలని, ఏదీ చెప్పకుండా కాలం గడపడం మంచిది కాదని ఆయన అన్నారు. ఎపి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని, ఇవాళ కేంద్రం ప్రకటించిన నిధులపై కూడా స్పష్టత లేదని, ఉన్నత విద్యామండలి విషయంలో 'సుప్రీంకోర్టు' తీర్పు కూడా అమలు జరగడంలేదని ఆయన అన్నారు. ఇప్పటికే రాష్ట్రం 12వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో సతమతమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మించాలంటే ఎంత ఖర్చువుతుందో అందరికీ తెలుసనని, విభజన చట్టం తయారు చేసిన వాళ్లు, దాన్ని ఆమోదించిన వారు ఇప్పుడు ఎందుకు సహాయం చేయడం లేదని ఆయన నిలదీశారు. విభజన చట్టంలో పేర్కొన్న ఐదు ప్రధాన హామీలైన ప్రత్యేకహోదా, ఆర్థికలోటు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, పోలవరం ప్రాజెక్టు, విశాఖరైల్వేజోన్‌పై వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

(168)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ