WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పోరాడి ఓడిన 'సింధు'...భారత్‌కు రజతం..

బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ మహిళల ఫైనల్స్‌లో స్పెయిన్‌ క్రీడాకారిణి కరోలినా మరిన్‌ రెండో సెట్‌లో అద్బుతంగా పుంజుకుంది. తొలిసెట్‌ కోల్పోయిన మరిన్‌ రెండో సెట్‌లో వరల్డ్‌నెంబర్‌వన్‌ ఆటను బయటకు తీసింది. ఎడాపెడా షాట్‌లు కొడుతూ సింధును గుక్కతిప్పుకోనివ్వకుండా చేసింది. 21-12 పాయింట్లతో రెండో సెట్‌ కైవసం చేసుకుంది. మూడో సెట్‌ హోరా హోరిగా జరుగుతోంది. వరల్డ్‌ నెంబర్‌ వన్‌ 'కరోలినా' వరుసగా ప్లేస్‌లు, స్మాష్‌లతో 'సింధు'ను ఒత్తిడికి గురిచేసింది. 'సింధు' కొట్టిన కొన్ని షాట్‌లు కోర్టు అవతల పడడంతో 'కరోలినా' పని సులువైంది. ఎడమ చేతివాటం ప్లేయర్‌ అయిన 'కరోలినా' షాట్‌లకు 'సింధు' వద్ద సమాధానం కరువైంది. మూడోసెట్‌లో సింధు పోటీ ఇచ్చినా అది చాలలేదు. దీంతో వరల్డ్‌నెంబర్‌వన్‌ 'కరోలినా' 21-15తో విజయం సాధించి సర్ణం ఎగురేసుకుపోయింది.

(1060)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ