WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అధికారులు వర్సెస్‌ ప్రజాప్రతినిధులు...!

ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు ఉండగా ఒక జిల్లాలో చిత్రవిచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ జిల్లా అంతా అధికారమయమే. ఎమ్మెల్యేలు, ఎంపిలు, జడ్పీటీసీలు, ఎంపిపిలు మొత్తం అధికారపార్టీకి చెందిన వారే. దీంతో వీరేం చేసినా ప్రశ్నించేందుకు బలమైన ప్రతిపక్షం లేదు. నిజాయితీపరులైన అధికారులు ఈ జిల్లాలో బాధ్యత నిర్వహించాలంటే ప్రతిపక్ష పాత్ర వారే నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్ని అభివృద్ధి పనులు చేసినా, ఈ జిల్లా అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు సంతృప్తి కలగడం లేదు. ఎందుకంటే అభివృద్ధి పనులు మాకెందుకూ...మా ఆర్థికాభివృద్ధి గురించి ఆలోచించాలని అధికారులను వేధిస్తుంటారు. ఇది ఉభయగోదావరి జిల్లాలోని పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న అధికార చదరంగపు ఆట. జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులు అత్యంత నిజాయితీపరులే. ఈ అధికారులను ఏరి కోరి పశ్చిమగోదావరి జిల్లాలో నియమించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పదేళ్లు అధికారంలో లేకపోవడంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నామని ఆదాయాలు వచ్చే పనులు మీరు చక్కబెట్టాలని, అధికారులను కోరుతున్నా ఈ ప్రజాప్రతినిధులు. కానీ నిజాయితీపరులైన ఈ అధికారులు అందుకు సిద్ధంగా లేరు. దీంతో ఆ ప్రజాప్రతినిధులందరూ కూడబలుక్కుని అధికారవర్గాన్ని అభాసుపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి పొగడ్తలతో ప్రశంసిస్తారు..బయటకు వెళ్లాక..సన్నిహితుల సమక్షంలో విమర్శలు చేస్తూ అధికారులకు గోతులు తవ్వుతారు. ఈ జిల్లాలో బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో అధికారపార్టీ నాయకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా పరిస్థితి నెలకొంది. కానీ అధికారగణం మాకు సహకరించడం లేదని వారిని బదిలీ చేయాలని ఈ నాయకులంతా తెరవెనుక ఉండి ప్రతిపక్ష నాయకులతో విమర్శలు చేయిస్తున్నారు. ఇక్కడ పనిచేయడం చాలా కష్టమని, అధికారులకు అనుభవంతో కాని తెలిసిరాలేదు..ఏ జిల్లాలోనైనా పనిచేయవచ్చు కానీ..పశ్చిమగోదావరి జిల్లాలో నిజాయితీగా పనిచేయడం చాలా కష్టమని,అధికారులు భావిస్తూ ఎంత తొందరగా ఈ జిల్లా నుండి తమను తప్పిస్తే అంత సంతృప్తి పడతామని భావిస్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు మినహా మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర అధికారపార్టీ నాయకులు,స్థానిక సంస్థల ప్రతినిధుల్లో ఎక్కువ మంది అందిన వరకు దోచుకోవడే లక్ష్యంగా పెట్టుకున్నారు.

(528)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ