WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అజ్ఞాతవాసం వీడిన ఐఎఎస్‌...!

ఆయన ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి హోదాలో ఉన్న సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా ఆయనకు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఏ కారణాలతో ప్రభుత్వం ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక కార్పొరేషన్‌కు ఎండిగా ఆయన నియమింపబడ్డారు. రాష్ట్ర విభజన జరగిన తరువాత కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరుపున అదే కార్పొరేషన్‌కు ఎండిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన హయాంలో జరిగిన అవినీతి, అవకతవకలు..గత ఎండిల హయాంలో కూడా జరగలేదని ఆ ఎండి పేరుతో కింది స్థాయి అధికారులు దోపిడీకి పాల్పడ్డారని ప్రభుత్వానికి ఫిర్యాదు వచ్చాయి. ఈ దోపిడికి పాల్పడ్డవారిలో కొందరు రిటైర్డ్‌ అయ్యారు. ఒకరిద్దరు మాత్రమే ఇంకా సర్వీసులో కొనసాగతున్నారు. ఆయన కార్యాలయానికి సకాంలో రారు. ఎప్పుడు వస్తారో...ఎప్పుడు పోతారో తెలియదు. ఒక్కొక్కసారి రాత్రి తొమ్మిదిగంటలకు కూడా కార్యాలయానికి వస్తుంటారు. వచ్చే మందుకు ముఖ్యమైన ఫైళ్ల ఏమైనా ఉన్నాయా? అని కింది స్థాయి అధికారులను అడుగుతారు. ఎన్ని ఫైళ్లు ఉన్నాయి...అందులో ఎన్ని నాకు ఉపయోగపడతాయి...అని ప్రశ్నిస్తారు. ఉపయోగపడే ఫైళ్లను అనగా ఆర్థిక పరంగా ఆదాయం వచ్చే ఫైళ్లను వెంటనే పరిష్కరిస్తారు. ఈ తతంగం ఎప్పటి నుండో జరుగుతుంది. అయినా శాఖాధిపతులు పట్టించుకోరు..మంత్రి కార్పొరేషన్‌పై దృష్టిపెట్టరు. అనేక ఫిర్యాదులు ముఖ్యమంత్రి లిఖితపూర్వకంగా ఆధారాలతో చేసినా, అక్కడి అధికారులు వాటిని చెత్తబుట్టలో వేస్తారు. ఈ మధ్య ఏం జరిగిందో ఏమో కానీ ఆయన నెలరోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు..ఆయన ఎక్కడికి వెళ్లారో ఏం చేశారో...సెలవు పెట్టి వెళ్లారా? లేక సెలవు పెట్టలేదా? అనే విషయం బయటకు తెలియనివ్వడం లేదు. అజ్ఞాతవాసం నుండి ఇటీవలే బయటకు వచ్చారు..ఒకటి రెండుసార్లు కార్యాలయానికి వచ్చి వెళ్లారని సిబ్బంది చెబుతున్నారు. ఈ అజ్ఞాత వాసంలోకి ఐఎఎస్‌ అధికారి వెళ్లడం ఏమిటి? అసలు ఏమి జరిగింది? ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా ఆ అధికారికి ఎందుకు ఇవ్వలేదు..ఇంతకు ముందు ఆయనపై పలువురి చేసిన ఫిర్యాదులపై ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందా? ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అధికారి సామాజికవర్గం ఈ ఎండి సామాజికవర్గం ఒకటేనట. అందుకే కాబోలు ఈ అధికారి ఎన్ని విమర్శలు, ఆరోపణలు ఆధారాలతో దొరికినా పట్టించుకునే నాధుడే లేడు. అసలు విషయం బయటకు రావాలంటే ఆయన అజ్ఞాతవాసం కారణం తెలుసుకోవాలి.

(392)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ