WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సిఎం కార్యాలయం నుండి ఇద్దరు అవుట్‌...ఒకరు డౌట్‌...!

రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తూ దేశ,విదేశాల ప్రముఖుల ప్రశంశాలు పొందిన, అపార రాజకీయ, అధికార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తన అంతరంగిక సిబ్బంది వ్యవహారశైలి, పనితీరు తలనొప్పి కల్గిస్తున్నాయి. ఒక అధికారి కలెక్షన్‌ కింగ్‌ అని ప్రచారం జరుగుతుండగా మరో అధికారి సెలక్షన్‌ కింగ్‌గా పలువురు వర్ణిస్తున్నారు. చంద్రబాబు కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారుల పనితీరుపై రకరకాల కథనాలు బయటకు పొక్కడంతో తాజాగా జరిగిన సంఘటనలు వెలుగులోకి రావడంతో పూర్తి వివరాలను చంద్రబాబు తెలుసుకుంటున్నారట. ఒక వైపు చంద్రబాబు గొప్ప పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చుకుంటుండగా ఆయన కార్యాలయ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంతో 'చినబాబు'ను రంగంలోకి దింపి పరిస్థితిని సరిచేయించేందుకు రంగం సిద్ధమైంది. నాన్నగారు..ఎక్కువ సయం బిజీగా ఉంటున్నారు..నేను ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోకూడదని మౌనంగా ఉంటున్నాను..అయినా జరగవలసిన నష్టం జరుగుతూనే ఉందని 'చినబాబు' కొందరి వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. గతంలో మీడియా వర్గాల ద్వారా సమాచారం తెలుసుకుని అందుకు తగినట్లు చర్యలు తీసుకునే 'బాబు' మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక పాత పద్దతిని అమలు చేయకపోవడంతో తన ప్రతిష్ట మంటగలిసిందని ఆయన భావిస్తూ దీనిపై ఎలా ముందుకు వెళ్లాల్లో, ఏమి చేయాలనే దానిపై శనివారం సాయంత్రంలోగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారట. మంత్రివర్గాన్ని, తన కార్యాలయాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తారా...? లేదా మరి కొంత కాలం మౌనం వహిస్తారా?

(643)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ