WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'లోకేష్‌'కు మంత్రి పదవి ఓకే...!

మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా మంత్రి పదవిలోకి ఆయనను తీసుకోవడం ఖాయం...ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినప్పటికీ ముందుగా మంత్రి పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. ఆయన ఎవరో కాదు..చంద్రబాబు రాజకీయవారసుడు 'నారాలోకేష్‌'. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదు..ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి..ఎలా ఎన్నిక కావాలి..స్థానిక సంస్థల ద్వారానా..? ఎమ్మెల్యేల ద్వారా? గవర్నర్‌ నామినేటెడ్‌ ద్వారానా? ఈ మూడు పద్దతుల్లో స్థానిక సంస్థల ద్వారా చినబాబు ఎమ్మెల్సీగా పోటీ చేయించాలని పలు జిల్లాల నాయకులు తాపత్రయపడుతున్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా నుండి 'చినబాబు'ను పోటీ చేయించేందుకు ఆ జిల్లా ఎమ్మెల్యేలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటే స్థానికంగా ఓటరు అయి ఉండాలి. ప్రస్తుతం చినబాబుకు కుప్పం నియోజకవర్గంలో తన ఓటును చేర్చుకున్నారు. అక్టోబర్‌1వ తేదీ నుండి మార్పులు..చేర్పులు..కొత్త ఓటర్లు నమోదు జరగనుండడంతో ఆయన తన నివాసాన్ని ఏలూరుకు మార్చుకుంటారా? లేక చిత్తూరు నుండే ఎమ్మెల్సీగా పోటీ చేస్తారా? ఈ రెండు కాకుండా ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక అవుతారా? ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఓటరు అయి ఉండాలి. అందుకే ఆయన ముందుగానే 'కుప్పం'లో ఓటర్‌గా నమోదు అయ్యారు. 2017, ఫిబ్రవరి మాసంలో సుమారు 22 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో కొన్ని ఎమ్మెల్యేల ద్వారా కొన్ని, స్థానిక సంస్థల ద్వారా మరి కొన్ని, గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాల ద్వారా మరి కొన్ని ఉన్నాయి. వీటిలో స్థానిక సంస్థల ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నిక అయితేనే 'చినబాబు'కు గుర్తింపు వస్తుందని 'పెదబాబు' భావిస్తున్నారట. చిత్తూరు నుండి 'చంద్రబాబు' ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు..'చినబాబు'ను ఉభయగోదావరి జిల్లాల్లో ఒక జిల్లా నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఆ జిల్లా ఇంకా అభివృద్ధి చెందుతుందని అక్కడ ప్రజాప్రతినిధులు ఆశపడుతున్నారు. ఇదంతా ఎందుకు ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక అయితే ఏ సమస్యలు ఉండవని 'చంద్రబాబు' భావిస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 'చినబాబు'ను నియమించినా తన వలే దూసుకెళ్లలేకపోయారని...ముందు ముందు కూడా ఆయన చొరవగా ముందుకెళ్లలేరని...అందుకే ఆయనను ప్రభుత్వంలో భాగస్వామిని చేయాలని 'చంద్రబాబు' నిర్ణయించుకున్నారట. మంత్రివర్గ విస్తరణ 'దసరా' లోపు జరుగడం ఖాయం.'చినబాబు'కు మాత్రమే బెర్త్‌ ఖాయమైంది.

(551)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ