WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అవినీతి ఎక్కడలేదు....! 'ఓ మంత్రి ప్రశ్న....?

పలు నియోజకవర్గాల్లో అవినీతికి పాల్పడుతూ, లంచాలు దండుకుంటున్న అధికారులపై ఆధారాలతో జిల్లా కలెక్టర్లకు, ఆయాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై ఈగ వాలనివ్వడం లేదు అమాత్యులు. అదేమిటయ్యా అని అడిగితే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు తెలియకుండా ఎవరిపై ఎటువంటి చర్య తీసుకోలేమని మీరు ముందుగా ఆయా అధికార ప్రతినిధులను స్వయంగా కలవండని మంత్రులు చెబుతున్నారట. ఇటీవల కొందరు అవినీతి అధికారుల వివరాలను సంబంధిత జిల్లాల కలెక్టర్లకు ఆయాశాఖల క్రింది స్థాయి అధికారులు ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది. కొద్ది రోజులు ఎదురు చూసినప్పటికీ ఆయా జిల్లాల కలెక్టర్లు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ శాఖ మంత్రికి పలువురు ఫిర్యాదు చేయగా ఇదుగో...అదుగో అంటూ అరిచేతిలో వైకుంఠం చూపించారు. మళ్లీ ఆ మంత్రిని కలసి విన్నవించగా 'మీకేం పనిలేదా...? అవినీతి ఎక్కడలేదు..ఏదైనా ఉంటే...మీ ఎమ్మెల్యేకో...మీ ఎంపికో ఫిర్యాదు చేసుకోండి... నా దగ్గరకు మళ్లీ రావద్దు...అంటూ కోపగించుకోవడంతో ఫిర్యాదు దారులు విస్తుపోయి ఖంగుతిన్నారు. ఒక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిపై యుద్ధం చేస్తుండగా ఆయన మంత్రివర్గ సహచరులు అవినీతిపరులపై చర్య తీసుకోమంటే మాకేం సంబంధం లేనట్లుగా మాట్లాడుతున్నారు. పరిస్థితులు ఈ విధంగా ఉంటే అవినీతిని ముఖ్యమంత్రి అంతం చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది...స్వంత మంత్రివర్గ సహచరులే అవినీతిపై చర్యలు తీసుకోకుండా చేతులు ఎత్తేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే ఒంటరిపోరాటం చేస్తారా? దీనిపై కొందరు ముఖ్యమంత్రిని కలసి వాస్తవాలు తెలియజేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

(394)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ