WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చారిత్రక టెస్టులో భారత్‌దే విజయం...!

చారిత్రాత్మకమైన 500వ టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌ దేశంతో జరుగుతున్న క్రికెట్‌ మ్యాచ్‌లో భారత్‌ అన్ని విభాగాల్లో పైచేయి సాధించి 'కివీస్‌'ను ఓడించింది. చారిత్రాత్మకమైన ఈ టెస్టును భారత్‌ 197 పరుగుల తేడాతో గెలుచుకుంది. తొలి రెండు రోజులు ఆదిపత్యం చెలాయించిన న్యూజిలాండ్‌ చివరి మూడు రోజుల్లో మాత్రం స్పిన్నర్‌ అశ్విన్‌ దెబ్బకు తలవంచాల్సి వచ్చింది. ఓవర్‌రుట్‌ స్కోరు 93/4తో డ్రా కోసం చివరి రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్‌ మధ్యాన్నానికే చాప చుట్టేసింది. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ తొలి టెస్టును నెగ్గి సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజ వేసింది. మొదటి ఇన్సింగ్స్‌లో 42 పరుగులు, రెండవ ఇన్సింగ్స్‌లో 50 పరుగులతో అజేయంగా నిలిచి మొత్తం ఆరు వికెట్లు సాధించిన ఆల్‌రౌండర్‌ జడేజాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. కాగా టెస్టుల్లో రెండు వందల వికెట్ల మార్కును దాటిన స్పిన్నర్‌ అశ్విన్‌ ఈ మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు సాధించాడు. సిసలైన ఆల్‌రౌండర్‌ ప్రతిభతో భారత్‌ ఈ మ్యాచ్‌ను సునాయాసంగా గెల్చుకుంది.

(233)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ