WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వంగవీటి' ట్రైలర్‌ విడుదల...!

నిజ జీవిత కథలను తెరకెక్కించి సొమ్ములు చేసుకునే వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాలవర్మ మరోసారి అదే దారిలో నడుస్తున్నారు. ఒకప్పుడు విజయవాడను హడలెత్తించిన 'వంగవీటి మోహన్‌రంగా' జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఆయన 'వంగవీటి' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాంధీజయంతి శుభాకాంక్షలతో తాను ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతే కాకుండా 'గాంధీ జయంతి' రోజున హింసాత్మకమైన 'వంగవీటి' ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గతంలో నేర చరిత్ర ఉన్న వ్యక్తుల జీవితాలను కథలుగా తీసిన 'వర్మ' ఇప్పుడూ అదే బాటలో నడుస్తున్నారు. 'రక్తచరిత్ర', 'కిల్లింగ్‌ వీరప్పన్‌' తదితర చిత్రాలను తీసిన ఆయన ఇప్పుడు 'వంగవీటి'ని ఎంచుకున్నారు. విజయవాడ వర్గ రాజకీయాలకు బలైన 'వంగవీటి'ని ఈ సినిమా ద్వారా హీరోగా చూపించబోతున్నారు 'వర్మ'. అప్పట్లో రెండు వర్గాలు విజయవాడపై ఆధిపత్యం కోసం సాగించిన పోరులో ఎందరో చనిపోయారు. ఈ పోరు చివరకు 'వంగవీటి మోహన్‌రంగా' ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. మొత్తం మీద వివాదాస్పద అంశాలను తీసుకుని వివాదాలు సృష్టించి సొమ్ము చేసుకునే 'వర్మ' తన పాతదారినే మళ్లీ ఎంచుకున్నారు.



(249)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ