WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆర్థికమంత్రి 'యనమల'కు 'డి' గ్రేడ్‌...!

రాష్ట్ర ఆర్థికశాఖ మరియు కమర్షియల్‌శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న యనమల రామకృష్ణుడు ఆ శాఖలపై పట్టుసాధించారు. అయినా ఆయన కుటుంబ సభ్యులు ఒకరు అధికారుల బదిలీలు,పోస్టింగ్‌ల్లో కలగచేసుకోవడంతో భారీ ఎత్తున్న అవినీతి జరిగిందని తూర్పుగోదావరి జిల్లాలో బాహాటంగా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశంలో చంద్రబాబు తరువాత సీనియర్‌ నేతగా ఆయనకు పేరున్నప్పటికీ కుటుంబసభ్యుల కోసం ప్రతిష్టపాలయ్యారు. సోదరుడు చినరామకృష్ణుడు (పళ్లరామకృష్ణుడు) వ్యవహారశైలి దూకుడుతనం 'యనమల'ను ఇక్కట్లపాలు చేసింది. అందుకే ఆయనకు 'డి' గ్రేడ్‌ వచ్చిందని అధికారపార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చినకుమార్తె పేర ఆసియన్‌ కంపెనీ రంగుల డబ్బా కంపెనీని పెట్టించారు. పెద్ద కుమార్తెను బాక్సైట్‌ వ్యాపారాలు చేయిస్తున్నారు. ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన అవైద్య,ఆరోగ్యశాఖలోని అత్యంత కీలకమైన మందుల కొనుగోలు సంస్థ పోస్టును ఇప్పించారు. మెత్తగా మాట్లాడుతూ వై.ఎస్‌.జగన్‌పై సుతిమెత్తని ఆరోపణలు చేస్తూ అధినేత చంద్రబాబు అభిమానాన్ని పొందినప్పటికీ కుటుంబసభ్యుల సంతృప్తి కోసం 'యనమల' దారి తప్పారని ఇటీవల ఆరోపణలు వస్తున్నాయి. టిడిపి రాజకీయాల్లో ఎటువంటి అవినీతి మచ్చలేని నేతగా పేరున్న 'యనమల'కు తాజాగా పై మచ్చలన్నీ అంటుకున్నాయి. ముఖ్యంగా ఆయన సోదరుడి 'చినరామకృష్ణుడు' 'యనమల'కు చెడ్డపేరు తెస్తున్నారు..2014 ఎన్నికల్లో 20వేల ఓట్లతేడాతోఓడిపోయిన 'చినరామకృష్ణుడు' ఈ రోజు నుంచి ఆ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కనీసం 50వేల ఓట్ల తేడాతో ఓడిపోతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి నిర్భంధంగా వసూలు చేయడంతో 'చినరామకృష్ణుడు' వద్ద నేర్చుకోవచ్చునని పార్టీ నాయకులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం అవుతుంది. ఈ విషయాలన్నీ చంద్రబాబుకు అందిన నివేదికలో ఉండడంతో 'యనమల'ను ఏమీ అనలేక జాగ్రత్తగా ఉండాలని పరోక్షంగా హెచ్చరించారట. పనితీరు కూడా మార్చుకొని అందరికీ అందుబాటులో ఉండాలని పదే పదే 'బాబు' 'యనమల'కు నొక్కిచెప్పినట్లు సిఎంఒ వర్గాలు ఆఫ్‌ ది రికార్డుగా బయటపెట్టాయి.

(195)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ