WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నెరవేరనున్న 'కాగిత' చిరకాల కోరిక...!

తెలుగుదేశం పార్టీలో ప్రస్తుత మంత్రుల్లోకెల్లాఎంతో సీనియర్‌ అయిన 'పెడన' ఎమ్మెల్యే కాగిత వెంకటరావుకు చిరకాల కోరిక మంత్రి పదవి నిర్వహించడం. ఇటీవల 'పెడన' మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికల్లో మెజార్టీ ఉన్నా టిడిపి అభ్యర్థి ఓడిపోవడంతో ఖంగుతిన్న 'కాగిత' దానిపై వివరణ ఇచ్చేందుకు సిఎం చంద్రబాబును కలిశారు. అక్కడ ఆయన ఏం చెప్పారో...బాబు ఏమి విన్నారో కానీ...అసలు విషయం పక్కకుపోయింది...'కాగిత' చిరకాల కోరిక బయటకు వచ్చింది. తాను రాజకీయాల నుండి రిటైర్ట్‌ కావాలనుకుంటున్నానని, ఇప్పటికైనా నా సినియార్టీని గుర్తించి మంత్రి పదవి ఇస్తే ఆ కోరిక కూడా తీర్చుకుని సంతోషంగా రాజకీయాల నుండి వైదొలుగుతానని 'కాగిత' చెప్పినట్లు బయటకు పొక్కింది. 'కాగిత' కోరికకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా 'కాగిత'కుమంత్రి పదవి ఖాయమని టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజాయితీపరుడైన రాజకీయనాయకుడిగా పేరున్న 'కాగిత'కు లౌక్యం తెలియదని ఆయన అనుచరులు చెబుతుంటారు..డబ్బు సంపాదించుకోవడం తెలియదు..పదవులు ఎలా తెచ్చుకోవాలో తెలియదు. అన్నింటికీ అవే వస్తాయిలే అంటారు..కానీ చివరకు ఎవరెవరికో మంత్రి పదవులు వచ్చాయి. 1985బంటుపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన 'కాగిత' రాజకీయ ప్రస్తావన...1989లో ఓడిపోయినా...1994,1999లో విజయం సాధించారు. 2004లో ఓడిపోయినా...2009లో అధికారుల గోల్‌మాల్‌తో స్వల్పతేడాతో ఓడిపోయినట్లు ఆ ఎన్నికల ఫలితం వెల్లడిచేశారు. నియోజకవర్గాల పునర్‌విభజనతో బంటుమల్లి నియోజకవర్గం రద్దు అయి 'పెడన' ఏర్పాటు అయింది. 2014లో ఆ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన 'కాగిత'కుమంత్రి పదవి వస్తుందని కృష్ణా టిడిపి నాయకులందరూ భావించారు. కానీ...ఆఖరునిమిషంలో కులాల సమీకరణలో 'బందరు' ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకు మంత్రి పదవి దక్కింది. అయినప్పటికీ 'కాగిత' అసంతృప్తి వ్యక్తం చేయకుండా సర్దుకుపోయారు. ఇక రాజకీయాల నుండి తాను తప్పుకోవాలని భావిస్తూ తన కోరికను అధినేత చంద్రబాబుకు తెలియజేశారు. ఆయన కూడా 'కాగిత' కోరికను మన్నించి మీకు ఆ గౌరవం కలుగ చేస్తానని చెప్పారట. ఈ విషయాన్ని 'కాగిత' అనుచరులు చెబుతూ ఎట్టికేలకు మా నాయకుని మంత్రి పదవి రాబోతుందని..సంతోషం గంతులు వేస్తున్నారు.

(184)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ