WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రష్యా,బ్రిటన్‌ల మధ్య యుద్ధం...ప్రారంభం కాబోతోందా...?

రష్యా,బ్రిటన్‌ల మధ్య మరి కొద్దిరోజుల్లో యుద్ధం ప్రారంభం కాబోతోందా? అంటే...అవుననే అంటున్నారు...ప్రపంచ రాజకీయవిశ్లేషణవేత్తలు... గత కొద్ది రోజులుగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేస్తున్న యుద్దసన్నాహాలు...అణుబాంబు ప్రయోగిస్తామని ఆయన చెబుతున్న మాటలు, అణుయుద్ధం వస్తే ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలన్న అంశంపై ఆ దేశ ప్రజలకు గత కొన్ని రోజులుగా శిక్షణ ఇస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఇంగ్లీషు ఛానెల్‌పై రష్యా ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రయాణించడం వంటి కారణాలతో త్వరలో రష్యా తమపై దాడి చేస్తుందని బ్రిటన్‌ భావిస్తోంది.దీంతో తాము కూడా ఎదురు దాడి చేయడానికి సిద్ధం అవుతోంది. దీనిలో భాగంగా భారీగా యుద్ధ ట్యాంకులు, డ్రోన్‌లు, దాదాపు 800 ట్రూప్స్‌ బలగాలను సరిహద్దులోకి తరలిస్తోంది. దీంతో ఏ క్షణానైనా రష్యా,బ్రిటన్‌ మధ్య యుద్ధం ప్రారంభం కావచ్చని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. రష్యా, బ్రిటన్‌ల మధ్య యుద్ధం సంభవిస్తే అది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్రిటన్‌కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగడం ఖాయం..దీంతో ప్రపంచంలోని దేశాలన్నీ రష్యా,అమెరికా పక్క చేరక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం రష్యా వ్యవహారశైలి చూస్తే ఆ దేశం ప్రపంచంపై మరో యుద్ధాన్ని రుద్దడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా ప్రపంచ యుద్దానికి మరికొన్ని రోజులే సమయం ఉందని విశ్లేషకులు అంటున్నారు...చూద్దాం..ఏమి జరుగుతుందో...!

(448)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ