WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రమణదీక్షితుల'పై వేటుకు రంగం సిద్ధం...!

తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు 'రమణదీక్షితుల' వ్యవహారశైలిపై పలు విమర్శలు, ఆరోపణలు వెలువడినప్పటికీ ఆయనపై చర్య తీసుకునేందుకు ఇంత ముందు ఇఒలుగా బాధ్యతలు నిర్వహించిన వారెవరూ ప్రయత్నించలేదు. కారణమేమిటంటే...ఎక్కువ మంది ఇఒలుగా బాధ్యలు నిర్వహించిన వారందరూ ఆయన సామాజికవర్గానికి చెందిన వారే. టిటిడి ఇఒలుగా బాధ్యతలు నిర్వహించిన ఐ.వై.ఆర్‌.కృష్ణారావు, రమణాచారి, ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, ఎం.జి.గోపాల్‌లతో సహా అందరూ 'రమణదీక్షితుల'ను పిలిచి మందలించారే కానీ...ఆయనపై చర్యలు తీసుకోలేదు. తాజాగా గర్భగుడిలో ఆయన తన మనవడితో ప్రవేశించడంపై వివాదాం చెలరేగడంతో ఆగ్రహం చెందిన ఇఒ సాంబశివరావు కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. తిరుమల జెఇఒ శ్రీనివాసరాజు ఈ విషయంలో మెతకవైఖరి అవలంభించారని సిఎంఒ అధికారులు భావిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన ఇంత వరకు బయటపడలేదు. 'రమణదీక్షితుల'పై చర్య తీసుకుంటే ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కేంద్ర,రాష్ట్ర రాజకీయ నాయకులతోపాటు రిలయన్స్‌ అంబానీ వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయని టిటిడి ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికే విజిలెన్స్‌శాఖలో అనేక కేసులు 'రమణదీక్షితుల'పై పెండింగ్‌లో ఉన్నాయి. చేసిన తప్పులకు పశ్చాత్పాపడకుండా గత 40ఏళ్ల నుంచి నిజాయితీగా బాధ్యతలు నిర్వహిస్తున్నా...టిటిడిలో పనిచేస్తోన్న ఒక వర్గం అధికారులు,ఉద్యోగులు తనను బదనాం చేస్తున్నారని ఆయన ఎదురుదాడికి దిగుతున్నారు. దీనిపై టిటిడి ఉద్యోగులు కొందరు 'జనం ప్రత్యేక ప్రతినిధి' స్వయంగా మాట్లాడుతూ 'ఆయనపై విజిలెన్స్‌ కేసులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తం కాదా...? ప్రైవేట్‌ యజ్ఞయాగాదులను ఆయన నిర్వహించలేదా...? తిరుమల వచ్చిన ప్రముఖుల వద్దకు స్వయంగా వెళ్లి ఆశ్వీరచనాలు ఇచ్చి ఖరీదైన కానుకలు స్వీకరించలేదా? అలా వెళ్లినందుకు టిటిడి అధికారులు షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన విషయం యధార్థం కాదా...? ఆయన నిబంధనలకు విరుద్ధంగా తన కుమారునికి కూడా తిరుమలలో పూజారి ఉద్యోగాలు ఇప్పించుకున్నది నిజం కాదా? వారిలో ఏ ఒక్కరూ సక్రమంగా బాధ్యతలు నిర్వహించారా? శ్రీవారిపై భక్తిశ్రద్ధలు వారికి ఉన్నాయా? వీటన్నిటిపై విచారణ జరిపితే ఇన్నేళ్లు 'రమణదీక్షితులు' ఎన్ని నిర్వాకాలు చేశారో...? నిబంధనలకు విరుద్ధంగా సాంప్రదాయాలను మంటగలిపారో అన్ని బయటపడతాయని వారు అంటున్నారు. వాస్తవానికి 'రమణదీక్షితుల'పై తమకెవరికీ కోపం లేదని, శ్రీవారి ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారనేదే తమ అభ్యంతరమే తప్ప ఆయనపై విమర్శలు చేయాలని అవసరం లేదన్నారు. నిన్నటి వరకు మౌనంగా ఉన్న ఇఒ సాంబశివరావు తాజాగా జరిగిన సంఘటనలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఇంత వరకు 'రమణదీక్షితుల'పై చర్య తీసుకునేందుకు ఏ ఒక్క ఇఒ ముందుకు రాలేదు..దానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ప్రస్తుత ఇఒ 'సాంబశివరావు' 'రమణదీక్షితుల'పై చర్య తీసుకోవడం ఖాయమని, ఆయన వ్యవహారశైలిని రెండేళ్ల నుండి గమనిస్తున్నామని ఆయన దేనికి భయపడరని, ఆయన మాత్రమే ఈయనపై చర్య తీసుకొనే సాహసం చేస్తారని వారు నమ్మకంగా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రమణదీక్షితులు...చేసిన తప్పులు సరిచేసుకోకుండా ఉద్యోగులపై ఎదురుదాడి చేయడంతో వారు మండిపడుతున్నారు. మరి కొద్ది రోజుల్లో రమణదీక్షితులను ప్రధాన అర్చక పదవి నుండి సస్పెండ్‌ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో సిఎం చంద్రబాబునాయుడు మౌనం వహిస్తే అన్ని వర్గాల్లో ఆయనకు మంచి పేరు వస్తుందని టిటిడి ఉద్యోగులు అంటున్నారు. ఇప్పటికే మాజీ ఇఒలు రమణదీక్షితులతో సంబాషిస్తున్నారని ఆయనపై ఈగవాలకుండా చూడాలని దానికి ఏమి చేయాలో బయటపడకపోయినా...ఏదో గూడుపుఠాణి చేసైనా 'రమణదీక్షితుల'ను కాపాడాలని వారు భావిస్తున్నారట.

(400)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ