WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మూడుసార్లు ఓడిపోయినా...మంత్రిపదవి కోసం ఆరాటం...!

ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకుడు. నియంతృత్వపోకడలతో పార్టీలో ఉన్నవారందరూ తన మాటే వినాలని కోరుకుంటారు. అధికారయంత్రాంగం ఎప్పుడూ తన చుట్టూ తిరిగాలని ఆశిస్తుంటారు. తన ఆశ్సీస్సులు లేకుండా జిల్లాల్లో ఏ ఒక్క అధికారి కానీ, ఉద్యోగి కానీ పనిచేయకూడాదని అంటుంటార. ముఖ్యంగా ఒక సామాజికవర్గ అధికారులంటే ఆయనకు అరికాలిలోమంట ఎక్కుతుందట. విచిత్రమేమిటంటే ఆ సామాజికవర్గ నేతల ఆశ్సీసులతోనే రాజకీయంగా ఎదిగారు...ఎమ్మెల్యేగా విజయం సాధించారు.మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు...అయినా ఆయనకు తృప్తికలగడం లేదట. ఒక సామాజికవర్గంపై వివక్షతో వ్యవహరించడంతో ఆ వర్గం ఓటర్లు ఆయనను ముప్పుతిప్పలు పెట్టి మూడుసార్లు ఓడించారు. అయినా ఆయన పద్దతి మార్చుకోలేదు. మూడుసార్లు ఓడిపోయి..ఓటమి హ్యాట్రిక్‌ వీరునిగా పేరుపొందిన ఆ నాయకుడు ఎవరో కాదు. ఆయనే...మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. 1994,1999లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన సోమిరెడ్డి తన వ్యక్తిగత పలుకుబడిని అధికంగా ఊహించుకుని ఒక వర్గ ఓటర్లును పరోక్షంగా అవమానాలకు గురి చేసి వారి ఆగ్రహావేశాలను చవిచూశారు. 2004,2009,2014ల్లో ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయి ఓటమి హ్యాట్రిక్‌ వీరునిగా బిరుదు పొందారు. ఆయనది ఎప్పుడూ ఒకే పాట...ఆ పాట ఏమిటంటే 'జగన్‌'పై పత్రికా సమావేశాల్లో దుమ్మెత్తిపోయడం వరకే. అది ఆయనకు వేరే విధంగా కలిసి వచ్చింది. 'చంద్రబాబు'ను ఎలా సంతృప్తి పరచాలో సోమిరెడ్డికి తెలుసు. అందుకే 'జగన్‌'పై ఆరోపణలు, విమర్శలు చేస్తుంటారు. ఆ దాడులకు సంతోషించిన 'చంద్రబాబు' మూడుసార్లు ఆయన ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు. ఆ పదవితో కూడా ఆయన తృప్తి పడడం లేదట. మంత్రి పదవి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఒకసారి మంత్రి పదవి ఇస్తే జిల్లాలో తెలుగుదేశం పార్టీని జీరో స్థాయికి తీసుకువచ్చారు...మళ్లీ మంత్రి పదవి ఇస్తే పాత పరిస్థితే పునరావృతం అవుతుందని..చంద్రబాబుకు భయం అట. అందుకేనేమో మంత్రివర్గ విస్తరణ రోజు రోజుకు గడువు పొడిగిస్తున్నారు. ఇదిగో...అదుగో అంటూ మంత్రి పదవి త్వరలో తనకు రావడం ఖాయమని జిల్లాలో 'సోమిరెడ్డి' ప్రచారం చేసుకుంటున్నారు. అందుకేనేమో జిల్లా అధికారయంత్రాంగం కూడా సోమిరెడ్డికే ఎక్కువ విలువ ఇస్తుందట. పర్సనాలిటీ లేకపోయినా...మాటలతో కోటలు కడుతూ అధినేతను సంతృప్తి పరుస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి ఖాయమని రాజకీయ పరిశీలకులు కూడా పలు చర్చావేదికలపై అభిప్రాయపడుతున్నారు. 'చినబాబు' కూడా 'సోమిరెడ్డి'కి మద్దతు ఇస్తున్నారని, ఈ మద్దతు వెనుక మీడియా సీనియర్‌ ప్రతినిధి ఒకరు ఉన్నారని నెల్లూరు జిల్లాలో ప్రచారం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణ జరిగేదెప్పుడో...సోమిరెడ్డికి అధికారం దక్కేదెన్నడో వేచి చూడాల్సిందే.

(840)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ