WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చెల్లని నోట్లన్నీ 'తిరుమల వెంకన్నకే...!

'మోడీ' ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో బ్లాక్‌మనీ దారులు 'తిరుమల'కు క్యూ కడుతున్నారు. అక్రమంగా వేల కోట్లు దాచిన ఈ నల్లకుబేరులు ఇక ఆ సొమ్మును మార్చుకోవడం అంత సులువు కాదని భావించి చేసిన పాపాలను కడుక్కోవడానికి, తమ వద్ద ఉన్న బ్లాక్‌మనీని వదిలించుకోవడానికి 'తిరుమల' వెళుతున్నారట. వేల కోట్లు అక్రమంగా దాచిన ఈ సొమ్ము 'తిరుమల వెంకన్న ' హుండీలో వేస్తారని టిటిడి అధికారులు భావిస్తున్నారు. అందుకే వీటిపై నిఘా పెట్టడానికి వారు సిద్ధం అవుతున్నారట. ఈ అంశంపై తిరుమల ఇఒ సాంబశివరావు అధికారులతో ఇప్పటికే చర్చించారట. వందల కోట్ల సొమ్మును 'వెంకన్న' హుండీలో వేస్తారని వీరిపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారట. ఇప్పటికే పెద్దనోట్ల రద్దుపై ఆయన తిరుమల ఆర్థికశాఖ అధికారులతో చర్చించారు. ఉన్న నోట్లను ఆర్‌బిఐలో సమర్పించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ నోట్ల బెడద మరింత ఎక్కువైన నేపథ్యంలో వాటిని ఏ రోజుకు ఆ రోజు ఆర్‌బిఐకి సమర్పించాలని నిర్ణయించారట.

(324)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ