WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'డోనాల్డ్‌ట్రంప్‌' ఘన విజయం...!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ట్రంఫ్‌ ఘన విజయం సాధించారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా సంస్థలు అర్థరాత్రి వెల్లడించాయి. మొత్తం 50 రాష్ట్రాల్లోని ఎలక్టోరల్‌ఓట్లలో మెజారిటీకి అవసరమైన 270 సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో రిపబ్లికన్లు విజయం సాధించినట్టు సమాచారం. ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌ అనూహ్య పరాజయాన్ని చవిచూశారు. అమెరికా అధ్యక్షపదవికి ట్రంప్‌తో హోరాహోరీగా పోరాడిన హిల్లరీ క్లింటన్‌ ట్రంప్‌కి ఫోన్‌ చేసి ఓటమిని అంగీకరించినట్లు యూఎస్‌ మీడియా రాసింది. అయితే ఈ సందర్భంగా ఆమె ఎలాంటి ప్రసంగం చేయబోరని డెమోక్రటిక్‌ క్యాంపెయిన్‌ చీఫ్‌ జాన్‌ పొడెస్టా ప్రకటించారు. హిల్లరీ వెంట ఉండి చివరి వరకు పోరాడిన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, వారిని ఇళ్లకు వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. ఇది సుదీర్ఘ రాత్రి అని, సుదీర్ఘ ప్రచారం చేసి అంతా అలసి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.గెలిచినా, ఓడినా.. ఫలితాలు వెలువడిన తర్వాత ప్రసంగించడానికి హిల్లరీ వేర్వేరు ఉపన్యాసాలతో సిద్ధమైనారని గతంలో డెమొక్రటిక్‌ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

(513)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ