WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సెంటిమెంటే...ట్రంప్‌ విజయానికి కారణమా...?

అమెరికన్ల సెంటిమెంట్‌ డొనాల్డ్‌ట్రంప్‌ను అనూహ్య విజయతీరాలకు నడిపించిందా...? లేక అమెరికన్ల సాంప్రదాయం పనిచేసిందా..? 1992 నుంచి 2000 వరకు డెమోక్రటిక్‌ పార్టీ తరువాత 2000 నుంచి 2008 వరకు రిపబ్లికన్లు 2008 నుంచి 2016 డెమోక్రటిన్లను ఆదరించిన అమెరికన్లు మరోసారి అదే సాంప్రదాయన్ని కొనసాగిస్తూ ఈ సారి మళ్లీ రిపబ్లికన్లకు పట్టం కట్టారు. రిపబ్లికన్‌ అభ్యర్థిగా మొదటి పార్టీ ఎంపిక చేసినప్పటి నుంచి వివాదాస్పదమైన ప్రవర్తనతో...అసహ్యమైన భాషతో వెర్రెక్కించిన డొనాల్డ్‌ట్రంఫ్‌ గెలుపు అనూహ్యమే. ఆయన గెలుస్తారని...ప్రపంచంలోని మెజార్టీ ప్రజలు భావించలేదు. సరి కదా...అమెరికాలో పేరుమోసిన మీడియా సంస్థలు కూడా ఆయన గెలుస్తారని చెప్పలేదు. కనీసం ఒక్కసర్వే అయినా ఆయన లీడ్‌లో ఉన్నారని ప్రకటించలేదు. రోజూ డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీనే పైచేయిలో ఉన్నారని పలు సర్వే సంస్థలు..మీడియా ఊదరగొట్టింది. అయితే ఫలితాలు వెలువడిన అనంతరం వీరంతా ఖంగుతిన్నారు. తాము హిల్లరీ సులువుగా గెలుపొందుతుందని చెపితే ఆమె చివరకు ట్రంప్‌కు గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారే అనే చర్చ ఇప్పుడు ప్రపంచంలో మెజార్టీ ప్రజల్లో జరుగుతోంది. అయితే ప్రపంచ ప్రజలు...ఇతర దేశాల పౌరులు ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.....ట్రంప్‌ వైపు అమెరికన్ల మొగ్గుకారణం భావోద్వేగాలే. ఎందుకంటే తమ ప్రజలు తప్ప మరే ఇతర విషయాలు తనకు అక్కర్లేదని, ముందు అమెరికా...తరువాత ప్రపంచమన్న ట్రంప్‌ మాటలను మెజార్టీ అమెరికన్లు విశ్వసించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన రిపబ్లికన్‌ పార్టీనే తొలుత ఆయన ఓడిపోవాలని కోరుకుందని ప్రచారం జరిగింది. అందుకు ఆయన వ్యవహారశైలే కారణమైనా...ట్రంప్‌ ఒక పథకం ప్రకారం ప్రచారాన్ని వేడెక్కించారు. తొలుత నోటి దూల తీర్చుకోవడం...తరువాత విచారం వ్యక్తం చేయడం ఆయన ప్రచారశైలి.ఉగ్రవాదానికి ప్రధాన కారణం ముస్లింలని వారిని అమెరికా నుంచి తరిమేస్తానని ఆయన ప్రకటించిన తీరు మెజార్టీ అమెరికన్లు పార్టీల కతీతంగా ఆకట్టుకుంది. అదే సమయంలో మెక్సిన్లను అమెరికాలోకి రాకుండా గోడ కట్టిస్తానన్న ప్రకటపై కూడా మంచి స్పందన వచ్చింది. ప్రజల్లో కల తిరుగుతూ అమెరికన్ల విశ్వాసం ప్రోది చేసుకోవడంలో ఆయన సక్సెస్‌ అయ్యారు. వివాదాస్పద విషయాల కదిలించి..దానిపై సూటిగా సమాధానాలు చెప్పి ఆయన ప్రజలను విరివిగా ఆకట్టుకున్నారు. మరోవైపు డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ పై విషయాలపై ఆచి తూచి స్పందించడం కూడా ఆయన కలసి వచ్చింది. తమకు మేలు చేయడానికి ట్రంప్‌ ముందుంటారని మెజార్టీ ప్రజలు విశ్వసించారు. ముస్లింలను తరిమేస్తానన్న ప్రకటన...తెలంగాణలో ఎన్నికలకు ముందు...టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనా ఒకటేనన్నట్లు ఉంది. ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ను రాబట్టుకోవడానికి కెసిఆర్‌ కూడా పదే పదే ఆంధ్రా నాయకత్వంపై...ఆంధ్రా ప్రజలపై ధ్వజమెత్తారు. మాట్లాడితే...ఆంధ్రా భోజనం..అలా ఉంటుంది...ఇలా ఉంటుంది...మన కన్నా వాళ్లు తక్కువ వాళ్లు..తెలంగాణ వారిని దోచుకుంటున్నారన్న విధంగా ప్రసంగించి ఫలితాలు ఎలా రాబట్టుకున్నారో...అదే విధంగా ట్రంప్‌ అమెరికన్లను రెచ్చగొట్టడంలో సఫలం అయ్యారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు భారతీయులకు ఇవ్వమని...వీసాలకు సంబందించిన కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్న ఆయన మాటలు అమెరికన్లు రెచ్చగొట్టడానికి పనికి వచ్చాయి. ప్రపంచమంతా ఐసిస్‌ ఉగ్రవాదులకు బెదిరిపోతున్న సమయంలో కేవలం ఒక మతాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కెసిఆర్‌నే పోలి ఉన్నాయి. తద్వారా తాను అనుకున్న లక్ష్యాన్ని ట్రంఫ్‌ సాధించగలిగారు. అధికారంలోకి వచ్చిన తరువాత ట్రంప్‌ ఆ మతం పట్ల ఎలా వ్యవహరిస్తారో కానీ...ప్రస్తుతానికైతే విజయాన్ని సాధించగలిగారు. అదే సమయంలో రష్యా కూడా ఆయనకు పరోక్షంగా సహాయం చేసింది. అధ్యక్ష ఎన్నికల సమయంలో 'రష్యా' దూకుడుగా అణ్వాయుధాలను మొహరించడం సగటు అమెరికన్లలో భయాన్ని సృష్టించింది. హిల్లరీ క్లింటన్‌ దేశాధ్యక్షురాలైతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందన్న 'ట్రంఫ్‌' మాటలను వారు విశ్వసించారు. విలాసవంతమైన జీవితాలను గడుపుతున్న అమెరికన్లు ఇప్పుడు యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ఇక్కడే 'ట్రంఫ్‌' మాయాజాలం పనిచేసింది. దీంతో అమెరికన్లు ట్రంప్‌కు ఓటు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.ఇదే సమయంలో 'హిల్లరీ' ఈ-మెయిల్‌ కుంభకోణం బయటపడడం...కూడా ఆమెకు నష్టం చేకూర్చింది. అప్పటి దాకా...ట్రంప్‌ కన్నా 'హిల్లరీ'నే మేలని భావించిన అమెరికన్లు వ్యక్తిత్వపరంగా ఇద్దరూ ఒకటేనన్న ఆలోచనలోకి వచ్చారు. ట్రంప్‌ వ్యక్తిత్వంలో లోపాలు ఉన్నా సగటు అమెరికన్ల ప్రయోజనాలను రక్షిస్తారన్న ఏకైక కారణంతోనే ఆయన వారు గెలిపించారు. ఏది ఏమైనా ట్రంప్‌ చేసిన హామీలు..ఏ మాత్రం అమలులోకి వస్తాయో వేచి చూడాల్సిందే...!

(508)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ