WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వీళ్ల నాన్న కఠినాత్ముడట....!(వీడియో)

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ఖాన్‌ మరో సంచలనం సృష్టించబోతున్నారు. ఇద్దరమ్మాయిలకు కఠినాత్ముడైన తండ్రిగా ఆయన కనిపించబోతున్నారు. తన కుమార్తెలను రెజ్లర్‌గా తయారు చేయడానికి ఆయన వారిపట్ల ఎంత కఠినంగా ఉన్నారో ఈ రోజు రిలీజైన ట్రైలర్‌లో చూపించారు. లెజండరీ రెజ్లర్‌ 'మహావీర్‌ పోగట్‌' జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం 'దంగల్‌'. ఈ చిత్రంలో అమీర్‌ తన ఇద్దరు కుమార్తెలను రెజ్జర్లుగా తీర్చిదిద్దేందుకు ఎటువంటి కసరత్తులు చేయించారో...'హానీకారక్‌బాబు' అనే పాట ద్వారా వెల్లడించారు. అమీర్‌ కుమార్తెలుగా 'ఫాతిమా సనా షేక్‌, సాన్యా మరోత్రాలు నటించారు. ప్రయోగాత్మక చిత్రాలతో మెప్పించిన 'అమీర్‌' ఇప్పుడు రెజ్లంగ్‌ ఆట ద్వారా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. తాను నటించే చిత్రాల్లో వందశాతం పర్‌ఫెక్ట్‌ కోసం తపించే 'అమీర్‌' ఈ చిత్రంలోనూ అదే విధంగా కనిపించారు. నితేష్‌ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డిసెంబర్‌24న విడుదల కాబోతోంది.(434)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ